వందే భారత్ మిషన్: స్వదేశానికి చేరిన 91 మంది భారతీయులు!

ABN , First Publish Date - 2020-09-21T21:11:04+05:30 IST

కరోనా కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించడం కోసం ప్రారంభించిన ‘వందే భారత్

వందే భారత్ మిషన్: స్వదేశానికి చేరిన 91 మంది భారతీయులు!

న్యూఢిల్లీ: కరోనా కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించడం కోసం ప్రారంభించిన ‘వందే భారత్ మిషన్’ కొనసాగుతోంది. యూఏఈలో చిక్కుకున్న సుమారు 91 మంది భారతీయులతో దుబాయి నుంచి బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానం.. ఆదివారం ఉదయం మధ్యప్రదేశ్‌లోని దేవీ అహిల్యాబాయి హోల్కర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. కాగా.. ప్రయాణికులందరిని క్వారెంటైన్ కేంద్రాలకు తరలించినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. కాగా.. ‘వందే భారత్ మిషన్’ను భారత ప్రభుత్వం మే 7న ప్రారంభించింది. ప్రస్తుతం ఆరో విడత ‘వందే భారత్ మిషన్’ కొనసాగుతోంది. ఈ మిషన్‌లో భాగంగా ఇప్పటి వరకు దాదాపు 15లక్షల మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. 


Updated Date - 2020-09-21T21:11:04+05:30 IST