Vande Bharat Express: వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు ఎదురుదెబ్బలు: నిన్న గేదెల మంద.. నేడు ఆవు!

ABN , First Publish Date - 2022-10-08T01:48:48+05:30 IST

గురువారం నాడు రైలు పట్టాలు దాటుతున్న నాలుగు గేదెలను రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో రైలు (Vande Bharat Express) ముందు భాగంలో కొంత ఊడి కిందపడింది.

Vande Bharat Express: వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు ఎదురుదెబ్బలు: నిన్న గేదెల మంద.. నేడు ఆవు!

న్యూఢిల్లీ: ఇటీవలే ప్రారంభించిన సెమీ హైస్పీడ్ రైలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ (Vande Bharat Express) రైలును గేదెల మంద ఢీకొట్టడంతో దాని ముందు భాగం ఊడి వచ్చిన ఘటన జరిగి ఒక్క రోజు కూడా గడవక ముందే ఈసారి ఓ ఆవును ఢీకొట్టింది. గాంధీనగర్-ముంబై రూట్‌లో జరిగిందీ ఘటన. ఈ ఘటనలో రైలు ముందు బంపర్ భాగం సొట్టపడింది. ఈ ఘటనతో రైలు (Vande Bharat Express) 10 నిమిషాలపాటు ఆగిపోయింది. గురువారం నాడు రైలు పట్టాలు దాటుతున్న నాలుగు గేదెలను రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో రైలు (Vande Bharat Express) ముందు భాగంలో కొంత ఊడి కిందపడింది. దీంతో 8 నిమిషాల పాటు రైలు ఆగిపోయింది. ఈ బంపరును ఫైబర్ రీయిన్‌ఫోర్సడ్‌ ప్లాస్టిక్‌ను ఉపయోగించి తయారు చేశారు. ఈ ఘటనలో గేదెలు మృతి చెందాయి. అయితే, ముందు భాగం దెబ్బతినడం వల్ల రైలు నడిచేందుకు ఎలాంటి ఇబ్బంది లేకపోవడంతో కాసేపటికే రైలు అక్కడి నుంచి బయలుదేరింది.

 

ఇలాంటి ఘటనలను నివారించలేమని, రైలు నిర్మాణ సమయంలో ఈ విషయాలను గుర్తుపెట్టుకున్నట్టు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. దెబ్బ తిన్న నోస్ భాగాన్ని మార్చుకోవచ్చని పేర్కొన్నారు.  గత వారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ రైలు(Vande Bharat Express)కు జెండా ఊపి ప్రారంభించారు. గాంధీనగర్ నుంచి అహ్మదాబాద్‌లోని కలుపూర్ రైల్వే స్టేషన్ వరకు ప్రయాణించారు. తాజా ఘటన గాంధీనగర్‌కు దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఆనంద్ పట్టణానికి సమీపంలో మధ్యాహ్నం 3.44 గంటల సమయంలో జరిగింది. రైలు ముందు భాగంలో చిన్న సొట్ట పడిందని పశ్చిమ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ అధికారి సుమిత్ ఠాకూర్ తెలిపారు. ప్రయాణికుల్లో ఎవరికీ ఏమీ కాలేదని పేర్కొన్నారు.  

Updated Date - 2022-10-08T01:48:48+05:30 IST