Abn logo
May 9 2020 @ 18:30PM

వనస్థలిపురంలో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు..

Kaakateeya

హైదరాబాద్‌ : కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలోనూ కొంత మంది ఆగడాలు అస్సలు ఆగట్లేదు. ఈ కష్ట కాలాన్నే అదనుగా చేసుకుని రెచ్చిపోతున్నారు. తాజాగా.. నగరంలోని వనస్థలిపురం ఆటోనగర్‌లో సెక్స్ రాకెట్‌ గుట్టు రట్టు అయ్యింది. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు బొల్లారం మున్సిపల్‌ వైస్ చైర్మన్ అనిల్‌రెడ్డి, సాఫ్ట్‌వేర్ ఉద్యోగి దీక్షిత్‌లు పట్టుబడ్డారు. వీరితో పాటు ముగ్గురు యువతులు, ఇద్దరు విటులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ తంతు అంతా ఓయో హోటల్ నడిపిస్తున్నారు. అయితే ఆటోనగర్ ఓయో ఎండీ రాఘవేంద్రరెడ్డి ప్రస్తుతం పరారీలో ఉన్నారు. 


ఈ మేరకు ఈ నిర్వాహకులపై పలు సెక్షన్స్‌ ద్వారా కేసులు నమోదు చేసినట్లు పోలీసులు మీడియాకు వెల్లడించారు. కాగా.. వనస్థలిపురంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో ప్రస్తుతం రెడ్ జోన్‌లో ఉంది. అయితే ఇలాంటివేమీ లెక్కచేయకుండా సెక్స్ రాకెట్‌ను నడిపించేస్తున్నారు. పక్కా సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగి వారికి చెక్ పెట్టారు. కాగా.. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement