Abn logo
May 6 2021 @ 08:45AM

చుట్టూ సీసీ కెమెరాల నిఘా.. అయినా బరితెగించారు!

  • వనస్థలిపురంలో పాన్‌ షాపు పగులగొట్టి... 
  • రూ.40 వేల నగదు, 60 వేల సామగ్రి అపహరణ

హైదరాబాద్/వనస్థలిపురం : చుట్టూ సీసీ కెమెరాల నిఘా, సమీపంలోనే పోలీసు స్టేషన్‌.. అయినా దొంగలు బరితెగించారు. అర్ధరాత్రి వనస్థలిపురం పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో ఉన్న ఓ పాన్‌ షాపులో చోరీ చేశారు. వనస్థలిపురం ఎన్జీవోస్‌ కాలనీలో నివాసం ఉండే దేవరశెట్టి సాయి కుమార్‌, వనస్థలిపురం పోలీస్‌ స్టేషన్‌ వద్ద వనస్థలి పాన్‌ మహాల్‌ పేరుతో షాపును నిర్వహిస్తున్నాడు. సాయి రోజూ మాదిరిగానే మంగళవారం రాత్రి షాపును మూసి ఇంటికెళ్లాడు. బుధవారం ఉదయం తిరిగి వచ్చిన సాయికి పాన్‌ షాపు తాళం పగులగొట్టి ఉంది. షాప్‌లో చోరీకి పాల్పడినట్లు గుర్తించాడు. రూ.40 వేల నగదు, రూ.60 వేల సావమగ్రి ఎత్తుకెళ్లినట్లు సాయి తెలిపాడు. వనస్థలిపురం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజ్‌లను పరిశీలించిన పోలీసులు రాత్రి 12.40 నిమిషాలకు చోరీ జరిగినట్లు గుర్తించారు. ద్విచక్రవాహనంపై వచ్చిన ఓ వ్యక్తి షాపు తాళం పగులగొట్టి చోరీ చేసినట్లు గుర్తించారు.

Advertisement