విద్యా హబ్‌గా వనపర్తి

ABN , First Publish Date - 2022-06-26T05:01:38+05:30 IST

ప్రభుత్వ మెడికల్‌, జేఎన్‌టీయూ ప్రభుత్వ ఇంజనీరింగ్‌ కళాశాలలతో వనపర్తి ఖ్యాతి పెరిగి విద్యా హబ్‌గా మారనుం దని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అ న్నారు.

విద్యా హబ్‌గా వనపర్తి
చిల్డ్రన్‌ హోమ్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న మంత్రి నిరంజన్‌రెడ్డి

- వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి 

- చిల్డ్రన్‌ హోమ్‌, వర్కింగ్‌ ఉమెన్స్‌ హాస్టల్‌ భవన నిర్మాణాలకు భూమిపూజ


వనపర్తి అర్బన్‌, జూన్‌ 25: ప్రభుత్వ మెడికల్‌, జేఎన్‌టీయూ ప్రభుత్వ ఇంజనీరింగ్‌ కళాశాలలతో వనపర్తి ఖ్యాతి పెరిగి విద్యా హబ్‌గా మారనుం దని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అ న్నారు. జిల్లా కేంద్రంలో కొత్తగా నిర్మాణం అవు తున్న ప్రభుత్వ మెడికల్‌ కళాశాల వద్ద చిల్డ్రన్‌ హోమ్‌, వర్కింగ్‌ ఉమెన్స్‌ హాస్టల్‌ భవన నిర్మాణా నికి మంత్రి భూమిపూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వనపర్తి వాసులకు అన్నిర కాల విద్య అందుబాటులో ఉండాలన్నదే తన లక్ష్యమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆశీస్సులతో ఇదివరకే మత్స్య కళాశాల, తాజాగా మెడికల్‌, ఇం జనీరింగ్‌ కళాశాలల రాకతో వనపర్తికి కొత్త కళ రానున్నదన్నారు. కేజీ నుంచి పీజీ వరకే కాదు.. మెడికల్‌, జేఎన్‌టీయూ ప్రభుత్వ ఇంజనీరింగ్‌ కూ డా ఇక్కడే చదివే అవకాశం కల్పిస్తున్నట్లు తెలి పారు. మొదటినుంచి విద్యారంగంలో వనపర్తి అగ్రభాగాన ఉన్నదని, 1958లోనే ఇక్కడ పాలిటె క్నిక్‌ కళాశాల ఏర్పాటు అయిందని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రంలో కళాశాలలకు మరింత వన్నె తెచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. కార్యక్రమం లో జడ్పీ చైర్మన్‌ లోక్‌నాథ్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌ వేణుగోపాల్‌, మునిసిపల్‌ చైర్మన్‌ గట్టుయాదవ్‌, వైస్‌ చైర్మన్‌ వాకిటి శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-06-26T05:01:38+05:30 IST