రామయ్య గారు.. మీ ఆరోగ్యం ఎలా ఉంది?

ABN , First Publish Date - 2022-06-01T18:40:37+05:30 IST

రామయ్య గారూ మీ ఆరోగ్యం ఎలా ఉంది..? మీ గురించి సీఎం గారు అడిగారు...! మీరు త్వరగా కోలుకోవాలి...! మీరు పూర్తిగా కోలుకున్న తర్వాత మిమ్ముల్ని వ్యక్తిగతంగా వచ్చి

రామయ్య గారు.. మీ ఆరోగ్యం ఎలా ఉంది?

- సీఎం కేసీఆర్‌ మీ గురించి అడిగారు 

- వనజీవి రామయ్యకు రాజ్యసభ సభ్యులు సంతోష్‌కుమార్‌  ఫోన్లో పరామర్శ

- ఆరోగ్యం కుదుటపడటంతో డిశార్చ్‌ చేసిన వైద్యులు


ఖమ్మం: రామయ్య గారూ మీ ఆరోగ్యం ఎలా ఉంది..? మీ గురించి సీఎం గారు అడిగారు...! మీరు త్వరగా కోలుకోవాలి...! మీరు పూర్తిగా కోలుకున్న తర్వాత మిమ్ముల్ని వ్యక్తిగతంగా వచ్చి కలుస్తా....!’’ అంటూ రాజ్యసభ సభ్యులు ఎంపీ సంతోష్‌కుమార్‌ వీడియో కాల్‌ ద్వారా వనజీవి, పద్మశ్రీ దరిపల్లి రామయ్యను ఫోన్లో వీడియోకాల్‌ ద్వారా పరామర్శించారు. ఆస్పత్రి సూపరిన్‌టెండెంట్‌ బి వెంకటేశ్వర్లు, ఆర్‌ఎంవో బి శ్రీనివాసరావు, ఏవో రాజశేఖర్‌ను వివరాలు అడిగారు. గాయాలు మానిపోయాయా, డాక్టర్లు బాగా చూసు కున్నారాఅంటూ పలువిషయాలను అడిగితెలుసుకున్నారు. మీ ఆరోగ్యం గురించి సీఎం గారు అడిగారు.. అంటూ రామయ్యకు ఎంపీ సంతోష్‌కుమార్‌ వివరించారు. మీరు పూర్తిగా కోలుకున్నాక మిమ్ముల్ని వ్యక్తిగతంగా వచ్చి కలుస్తా అంటూ హామీ ఇచ్చారు. డిశార్జ్‌ చేసి ఇంటికి పంపిన వైద్యులు పద్మశ్రీ వనజీవి రామయ్య ఇటీవలె రోడ్డు ప్రమాదంలో గాయపడి మే18న జిల్లా ఆస్పత్రిలో చేరారు. రోజులుగా 14 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పూర్తిగా కోలుకోవడంతో డిశార్జ్‌ చేశారు.

Updated Date - 2022-06-01T18:40:37+05:30 IST