వనజీవి ఇంట్లో ఎర్ర చందనం దుంగల పరిశీలన

ABN , First Publish Date - 2022-08-12T04:58:13+05:30 IST

మండల పరిదిలోని రెడ్డిపల్లి గ్రామంలోని పద్మశ్రీ పుర స్కార గ్రహీత వనజీవి రామయ్య ఇంట్లో ఎర్ర చందనం దుంగలను గురువారం అటవీ శాఖ సీసీఎఫ్‌ బీమా నాయక్‌ పరిశీలించారు.

వనజీవి ఇంట్లో ఎర్ర చందనం దుంగల పరిశీలన
వనజీవి ఇంట్లో ఎర్రచందనం దుంగలను పరిశీలిస్తున్నఅధికారులు

కొలతలు తీసుకున్న అటవీ శాఖ అధికారులు

ఖమ్మం రూరల్‌, ఆగస్టు 11: మండల పరిదిలోని రెడ్డిపల్లి గ్రామంలోని పద్మశ్రీ పుర స్కార గ్రహీత వనజీవి రామయ్య ఇంట్లో ఎర్ర చందనం దుంగలను గురువారం అటవీ శాఖ సీసీఎఫ్‌ బీమా నాయక్‌ పరిశీలించారు. వనజీవి రామయ్య కొన్నేండ్ల క్రితం నుంచి తన పొలం, ఇంట్లో ఎర్రచందనం మొక్కలను పెంచాడు. వాటిని గత ఆరునెలల క్రితం హరితనిధి కింద ఉచితంగా ప్రభుత్వానికి అందజేశాడు. అయితే ఆరునెలలు గడుస్తున్నా అటవీ అధికారులు వాటిని తరలించడం లేదు. ఈ విషయాన్ని వనజీవి రామయ్య ఎంపీ సంతోష్‌ కుమార్‌కు తెలియచేశాడు. దీంతో ఎంపీ సంతోష్‌ వెంటనే వాటిని తరలించాలని అటవీ అధికారులను ఆదేశించారు. ఎంపీ సంతోష్‌ ఆదేశాల మేరకు ప్రధాన అటవీ శాఖ అధికారి బీమా నాయక్‌ ఆధ్వర్యంలో అధికారులు రామయ్య ఇంటికి చేరుకుని దుంగల మొత్తాన్ని కొలతలు వేశారు. కొద్దిరోజుల్లో ప్రభుత్వ అనుమతులతో వాటిని హైదరాబాద్‌లోని డిపోనకు తరలిస్తామని అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్ర మంలో డీఎఫ్‌వో రంజిత్‌, ప్రకాశ్‌రావు, వేణుగోపాల్‌, అన్నం శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-12T04:58:13+05:30 IST