పంజాబ్‌లో మొక్కల రక్షణకు వన మిత్రల నియామకం

ABN , First Publish Date - 2020-05-26T23:05:15+05:30 IST

సిక్కుల గురువు గురు నానక్ దేవ్ 550వ జయంత్యుత్సవాల సందర్భంగా

పంజాబ్‌లో మొక్కల రక్షణకు వన మిత్రల నియామకం

చండీగఢ్ : సిక్కుల గురువు గురు నానక్ దేవ్ 550వ జయంత్యుత్సవాల సందర్భంగా గత ఏడాది నాటిన మొక్కల రక్షణ బాధ్యతను వన మిత్రలకు అప్పగించారు. 


గత ఏడాది గురు నానక్ దేవ్ 550వ జయంత్యుత్సవాల సందర్భంగా  550 చొప్పున  మొత్తం 73 లక్షల మొక్కలను గ్రామాల్లో నాటారు. వీటిని కాపాడే బాధ్యతను  19 వేల మంది వన మిత్రలకు అప్పగించారు. 


కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు అమలు చేస్తున్న అష్ట దిగ్బంధనం వల్ల జన సంచారంపై ఆంక్షలు విధించడంతో, ఈ మొక్కలను కాపాడే బాధ్యతను వన మిత్రలకు అప్పగించారు. 


ఈ వన మిత్రలను పంజాబ్ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ నియమించింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ  పథకంలో భాగంగా వీరిని నియమించారు. 


పంజాబ్‌లోని కపుర్తల జిల్లా, సుల్తాన్‌పూర్ లోఢీలో గురు నానక్ 550వ జయంత్యుత్సవాలు గత ఏడాది నవంబరులో జరిగాయి. ఈ సందర్భంగా  రాష్ట్రవ్యాప్తంగా 13 వేల గ్రామాల్లో 550 చొప్పున మొక్కలను నాటారు. 


Updated Date - 2020-05-26T23:05:15+05:30 IST