వంశధార ఉగ్రరూపం

ABN , First Publish Date - 2022-08-16T05:37:30+05:30 IST

వంశధార ఉగ్రరూపం దాల్చింది. నదిలోకి భారీగా వరద నీరు పోటెత్తింది. నదీ పరీవాహక ప్రాంతాలతో పాటు ఒడిశాలో కురుస్తున్న వర్షాలకు వరద నీరు చేరుతోంది. దీంతో వంశధార అధికారులు అప్రమత్తమయ్యారు. గొట్టాబ్యారేజీ వద్ద 22 గేట్లను పూర్తిగా పైకెత్తి కిందకు నీటిని విడిచిపెడుతున్నారు.

వంశధార ఉగ్రరూపం
హిరమండలం : గొట్టాబ్యారేజీ వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న వంశధార

నదిలోకి భారీగా వరద నీరు
హిరమండలం, ఆగస్టు 15:
వంశధార ఉగ్రరూపం దాల్చింది. నదిలోకి భారీగా వరద నీరు పోటెత్తింది. నదీ పరీవాహక ప్రాంతాలతో పాటు ఒడిశాలో కురుస్తున్న వర్షాలకు వరద నీరు చేరుతోంది. దీంతో వంశధార అధికారులు అప్రమత్తమయ్యారు. గొట్టాబ్యారేజీ వద్ద 22 గేట్లను పూర్తిగా పైకెత్తి కిందకు నీటిని విడిచిపెడుతున్నారు. సోమవారం ఉదయం నుంచి నదిలోకి ఇన్‌ఫ్లో గణనీయంగా పెరిగింది. ఉదయం 9 గంటలకు రికార్డుస్థాయిలో 85,402 క్యూసెక్కుల నీటిని గొట్టాబ్యారేజీ వద్దకు కిందకు విడిచిపెట్టారు. 10 గంటలకు 82,575 క్యూసెక్కులు ఉండగా సోమవారం రాత్రి వరకూ అదే స్థాయిలో వరద కొనసాగింది. దీంతో నదీ తీరానికి ఇరువైపులా పంట పొలాలు ముంపునకు గురయ్యాయి. ఆదివారం రాత్రి ఒడిశాలోని నదీ పరీవాహక ప్రాంతాల్లో 317.8 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. కట్రగడలో అత్యధికంగా 110 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైనట్టు అధికారులు చెబుతున్నారు. గొట్టాబ్యారేజీ వద్ద వరద స్థితిని ఎస్‌ఈ తిరుమలరావు పరిశీలించారు. డీఈఈ క్రాంతికుమార్‌కు సలహాలు, సూచనలందించారు. నదీ తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆర్డీవో హెచ్‌వీ జయరాం సూచించారు. సోమవారం గులుమూరు, అక్కరాపల్లి, ఎం.ఎల్‌.పురం, జిల్లోడిపేట, రెల్లివలస వరద ముంపుకు గురైన పంట పొలాలలను పరిశీలించారు. కాగా, గార మండలం కళింగపట్నం వద్ద నది సముద్రంలో కలిసే ప్రాంతంలో ఎర్రగా మారింది.
 
 

Updated Date - 2022-08-16T05:37:30+05:30 IST