ర్యాలీలో పాల్గొన్న వామపక్షాల, రైతు సంఘాల నాయకులు
వామపక్ష నాయకుల డిమాండ్
గుంటూరు(తూర్పు), నవంబరు26: వ్యవసాయ చట్టాలతో పాటు రైతు వ్యతిరేక బిల్లులైన విద్యుత్, కార్మిక చట్టాలను ఉప సంహరించుకోవాలని వామపక్ష నాయకులు డిమాండ్ చేశారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన సందర్భంగా శుక్రవారం నగరంలో వామపక్ష, రైతు నాయకులు విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోరాటాల ద్వారానే హక్కులను సాధించుకోగలమని మరోసారి రుజవైందన్నారు. రైతు ఉద్యమకారులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ర్యాలీలో పాశంరామారావు, నాదెండ్ల బ్రహ్మయ్య, ఉల్లిగడ్డ నాగేశ్వరరావు, కంచుమాటి అజయ్, కాల్వ శ్రీధరరావు, వి.రాఽధాకృష్ణమూర్తి, ముత్యాలరావు, కోటా మాల్యాద్రి, అరుణ, సుగణ, గనిరాజు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.