భీమవరంలో ‘వామన్‌రావు’ నిందితుడు

ABN , First Publish Date - 2021-05-09T08:42:33+05:30 IST

తెలంగాణలో సంచలనం సృష్టించిన న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్యకేసులో నిందితుడిగా ఉన్న పెద్దపల్లి జడ్పీ చైౖర్మన్‌ పుట్టా మధు పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో నాటకీయ పరిణామాల మధ్య పోలీసులకు దొరికిపోయినట్టు

భీమవరంలో ‘వామన్‌రావు’ నిందితుడు

పుట్టా మధును అదుపులోకి తీసుకున్న తెలంగాణ పోలీసులు 


భీమవరం, మే 8: తెలంగాణలో సంచలనం సృష్టించిన న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్యకేసులో నిందితుడిగా ఉన్న పెద్దపల్లి జడ్పీ చైౖర్మన్‌ పుట్టా మధు పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో నాటకీయ పరిణామాల మధ్య పోలీసులకు దొరికిపోయినట్టు తెలుస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మధు... తొలుత పోలీసుల విచారణకు హాజరై ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పోలీసుల నిఘాకు దొరకకుండా ఉండేందుకు ఏకంగా తెలంగాణ సరిహద్దులు దాటి ఏపీలోకి ఎంట్రీ ఇచ్చారు. అంతేకాకుండా తన ఆచూకీ కోసం పోలీసులు ఎలాగూ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తారని భావించిన మధు... ఆ నిఘాకు దొరకుండా ఏకంగా వారం రోజుల్లోనే ఆరు సెల్‌ ఫోన్లు, నాలుగు కార్లు మార్చారు. ఈ క్రమంలో మధు ఆచూకీ గుర్తించిన తెలంగాణ పోలీసులు భీమవరంలో ఓ లాడ్జీ వద్ద అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం.

Updated Date - 2021-05-09T08:42:33+05:30 IST