వాళ్లేమో ‘పాస్‌’.. వీళ్లకు ‘గ్రేడ్స్

ABN , First Publish Date - 2020-09-25T08:44:30+05:30 IST

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాల్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమవుతోంది. కొవిడ్‌-19 నేపథ్యంలో ఈ

వాళ్లేమో ‘పాస్‌’.. వీళ్లకు ‘గ్రేడ్స్

టెన్త్‌ ఫలితాల్లో సర్కారు భిన్న వైఖరి


అమరావతి, సెప్టెంబర్‌ 24 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాల్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమవుతోంది. కొవిడ్‌-19 నేపథ్యంలో ఈ ఏడాది జరగాల్సిన పదోతరగతి పరీక్షలను రద్దు చేసిన సర్కారు.. దాదాపు ఆరున్నర లక్షల మంది రెగ్యులర్‌ విద్యార్థులందరినీ పాస్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. వీళ్లకు మార్కులు గానీ, గ్రేడ్లు గానీ ఇవ్వబోమని కేవలం పాస్‌ మెమో ఇస్తామని తెలిపింది. ఏపీ ఓపెన్‌ స్కూల్స్‌ విధానంలో నిర్వహించాల్సిన టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలను కూడా రద్దు చేయడంతో 71,210మంది పాస్‌ అయ్యారు.


ప్రిపరేటరీ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా మార్కులు, గ్రేడ్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కాగా.. పది ఫలితాల విషయంలో కొందరికి పాస్‌ మాత్రమే ఇస్తామని నిర్ణయం తీసుకుని.. తాజాగా మరికొందరికి మార్కులు, గ్రేడ్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వ నిర్ణయాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలు తప్పుపడుతున్నారు. ఫలితాల విషయమై ప్రభుత్వం పునరాలోచన చేయాలన్న డిమాండ్లు వస్తున్నాయి.


Updated Date - 2020-09-25T08:44:30+05:30 IST