సర్దార్ పటేల్‌కు బీజేపీకి సంబంధం ఏంటి?: చాడ

ABN , First Publish Date - 2021-11-01T22:25:15+05:30 IST

సర్దార్ వల్లబాయ్ పటేల్‌కు బీజేపీకి సంబంధం ఏంటి? అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రశ్నించారు.

సర్దార్ పటేల్‌కు బీజేపీకి సంబంధం ఏంటి?: చాడ

హైదరాబాద్: సర్దార్ వల్లబాయ్ పటేల్‌కు బీజేపీకి సంబంధం ఏంటి? అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రశ్నించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చరిత్రను వక్రీకరిస్తున్నారని తప్పుబట్టారు. వల్లబాయ్ పటేల్‌తోనే తెలంగాణ విమోచనం అయిందన్న కిషన్‌రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నానని చెప్పారు. కమ్యూనిస్టుల సాయుధపోరాటం వలనే నిజాం‌ తలొగ్గాడని, గోబెల్స్ ప్రచారాన్ని ఆపి.. బీజేపీ నేతలు ప్రజలకు క్షమాపణ చెప్పాలని చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు.

Updated Date - 2021-11-01T22:25:15+05:30 IST