అమరావతి: సీఎం జగన్ దగ్గరకు గన్నవరం వైసీపీ పంచాయితీ చేరింది. సాయంత్రం 6 గంటలకు భేటీకి రావాలని వంశీ (Vamsi), దుట్టా రామచంద్రరావు సీఎం జగన్ నుంచి పిలుపు వచ్చింది. కొన్నిరోజులుగా వంశీ, దుట్టా వర్గాల మధ్య వర్గపోరు నడుస్తోంది. గడపగడపకు కార్యక్రమాన్ని పోటాపోటీగా ఇరు వర్గాలు నిర్వహిస్తున్నాయి. ప్రజావ్యతిరేకతకు మీరంటే మీరే కారణమంటూ ఇరువర్గాల ప్రచారం చేస్తున్నాయి. నియోజకవర్గంలో పరిస్థితి చక్కదిద్దే పనిలో సీఎం జగన్ ఉన్నారు. వైసీపీ తీర్థం పుచ్చుకున్న టీడీపీ నేతలున్న ప్రతిచోట ఇదే పరిస్థితి ఉంది. మంత్రివర్గ విస్తరణ తర్వాత పార్టీ వర్గాల్లో ఆగ్రహజ్వాలలు చెలరేగుతున్నాయి. గన్నవరంలో ఇప్పటికే పరిస్థితి చేజారిపోయిందని పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో దుట్టాను, వంశీని కూర్చోబెట్టి మాట్లాడాలని సీఎం నిర్ణయించుకున్నారు