అగ్నిప్రమాదాల్లో నష్ట నివారణకు రోబో వ్యవస్థ

ABN , First Publish Date - 2020-02-20T10:55:40+05:30 IST

అగ్నిప్రమాదాల వల్ల ప్రాణ, ఆస్తినష్టం జరుగ కుండా నివారించేందుకు అధునాతన రోబో వ్యవస్థను తీసురావడానికి కృషి చేస్తున్నట్లు బందరు ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు.

అగ్నిప్రమాదాల్లో నష్ట నివారణకు రోబో వ్యవస్థ

నాణ్యమైన పెట్రోలు లక్ష్యంగా అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో పెట్రోల్‌ బంక్‌ : ఎంపీ బాలశౌరి


గుడివాడ(రాజేంద్రనగర్‌), ఫిబ్రవరి 19 : అగ్నిప్రమాదాల వల్ల  ప్రాణ, ఆస్తినష్టం జరుగ కుండా నివారించేందుకు అధునాతన రోబో వ్యవస్థను తీసురావడానికి కృషి చేస్తున్నట్లు బందరు ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు.  దీని కోసం  రూ.1.50 కోట్లతో   పనులు చేపట్టడం జరుగుతుందన్నారు.  ప్రజలకు నాణ్యమైన పెట్రోలు అందించడమే లక్ష్యంగా భారత్‌ పెట్రోలియం సంస్థ, రాష్ట్ర అగ్ని మాపక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో పెట్రోలు బంక్‌ ఏర్పాటు చేసినట్లు బందరు ఎంపీ వల్లభనేని బాలశౌరి పేర్కొన్నారు.  


గుడివాడ అగ్నిమాపక కేంద్రం ఆవరణలో నూతనంగా నిర్మించిన ఆయిల్‌ ఫిల్లింగ్‌ కేంద్రాన్ని బాలశౌరి అధికారులు, ప్రజా ప్రతి నిధులతో కలిసి బుధ వారం ప్రారంభించారు.  రాష్ట్రంలో తొలిగా కైకలూరులో, రెండోది గుడివాడలో నిర్మించా రన్నారు. త్వరలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోని అగ్నిమాపక కేంద్రాల్లో ఆయిల్‌ ఫిల్లింగ్‌ కేంద్రా లు నిర్మించడం జరుగుతుందన్నారు. అగ్నిమాప కేంద్రాల్లో పెట్రోల్‌ బంక్‌ అందు బాటులో ఉండడం వల్ల తక్షణమే ఆయిల్‌ ఫిల్‌ చేసుకుని ప్రమాద సంఘటనా స్థలాలకు వెనువెంటనే చేరుకొనే అవకాశం ఉందన్నారు.  


భారత్‌ పెట్రోలియం కంపెనీ టెరి టోరియల్‌ మేనేజర్‌ బి.ప్రకాష్‌, రిటైర్డ్‌ ఫారెస్టు అధికారి ఏసీ చౌదరి, అగ్నిమాపక శాఖ అధికారులు జి.శ్రీనివాసులు, శ్రీనివాసరెడ్డి, ఎ.శేఖర్‌, వైఎస్‌ ఆర్‌ పార్టీ నేత దుక్కిపాటి శశిభూషణ్‌, అగ్ని మాపక శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్‌ వారు ఇటీవవల అగ్ని ప్రమాదాల బారిన పడిన కుటుంబాలకు బియ్యం వంట సామాగ్ని అందించారు. అలాగే పట్టణంలోని పాఠశాలల్లో గల పేద విద్యార్థు లకు బుక్స్‌కిట్స్‌ బ్యాగ్స్‌ పంపిణీ చేశారు. 

Updated Date - 2020-02-20T10:55:40+05:30 IST