టీడీపీ నాయకుడు వాలిశెట్టి బాబు మృతి

ABN , First Publish Date - 2021-04-19T06:06:10+05:30 IST

బందరు రూరల్‌ మండలంలో ఎదురు లేని టీడీపీ నాయకుడిగా పేరొందిన వాలిశెట్టి బాబు ఆదివారం హైదరాబాద్‌లో మృతి చెందాడు. వాలిశెట్టి బాబుకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

టీడీపీ నాయకుడు వాలిశెట్టి బాబు మృతి

  గోపువానిపాలెంలో విషాదఛాయలు

మచిలీపట్నం టౌన్‌, ఏప్రిల్‌ 18 : బందరు రూరల్‌ మండలంలో ఎదురు లేని టీడీపీ నాయకుడిగా పేరొందిన వాలిశెట్టి బాబు ఆదివారం హైదరాబాద్‌లో  మృతి చెందాడు. వాలిశెట్టి బాబుకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.  1965 జనవరి 16న జన్మించిన వాలిశెట్టి బాబు బందరు మండలం గోపువానిపాలెం గ్రామానికి రెండు పర్యాయాలు సర్పంచ్‌గా పని చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బాబు భార్య చంద్రరేఖ సర్పంచ్‌గా  గెలుపొందారు. ప్రస్తుతం తెలుదేశం పార్టీలో ఉంటున్న బాబు గతంలో కాంగ్రెస్‌ పార్టీలో వివిధ హోదాల్లో సేవలందించారు.  గోపువానిపాలెం గ్రామానికి విద్యుత్‌ సౌకర్యం తీసుకుని వచ్చేందుకు కృషి చేశారు.  బాబు మృతి వార్త గ్రామంలోనూ, పార్ట శ్రేణుల్లోనూ విషాదాన్ని నింపింది. తమ గ్రామానికి పెద్ద దిక్కు లేకుండా పోయారని గోపువానిపాలెం గ్రామ ప్రజలు కన్నీరు మున్నీరు అవుతు న్నారు. బాబు మృతికి టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ  ఎంపీ, మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ  టీడీపీ అధ్యక్షుడు కొనకళ్ల  నారాయణ, మాజీ డిప్యూటి స్పీకర్‌ బూరగడ్డ వేదవ్యాస్‌, బందరు రూరల్‌  మండల అధ్యక్షుడు కుంచే నాని, టీడీపీ నాయకులు గొర్రెపాటి గోపీచంద్‌, ఎండీ ఇలియాస్‌ బాషా, పిప్పళ్ల కాంతారావు, పి.వి.ఫణికుమార్‌, వాలిశెట్టి తిరుమలరావు  , జనసేన నియోజక వర్గ ఇన్‌చార్జి బండి రామకృష్ణ, జనసేన అధికార ప్రతినిధి లంకిశెట్టి బాలాజీ, వైసీపీ నాయకుడు రామానుజ తదితరులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.  

Updated Date - 2021-04-19T06:06:10+05:30 IST