Abn logo
Apr 13 2021 @ 00:15AM

వలంటీర్ల సేవలు భేష్‌

వలంటీర్లకు పురస్కారాల సభలో మాట్లాడుతున్న మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి


- మంత్రి బాలినేని

ఒంగోలు(కలెక్టరేట్‌), ఏప్రిల్‌ 12 : సచివాలయ వలంటీర్లు అందిస్తున్న సేవలను ఎప్పటికి మరువలేమని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కొనియాడారు. స్థానిక కలెక్టరేట్‌లోని స్పందన హాలులో సోమవారం ఒంగోలు నియోజకవర్గస్థాయిలో వలంటీర్ల పురస్కారాల సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.  అనంతరం మంత్రి బాలినేని మాట్లాడుతూ కరోనా మళ్లీ విస్తరిస్తోందని, ఈ సమయంలో వైర్‌సబారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని,ప్రజలను చైతన్య వంతులను చేయాలని పిలుపునిచ్చారు. కలెక్టర్‌ పోలా భాస్కర్‌ మాట్లాడుతూ సంక్షేమ ఫలాలను పేదలకు అందించే వారధులుగా వలంటీర్లు నిలిచారన్నారు.  ఈ సందర్భంగా మంత్రి బాలినేని నగదు పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర మేయర్‌ గంగాడ సుజాత, జాయింట్‌ కలెక్టర్‌ టీఎస్‌ చేతన్‌, వివిధశాఖల అధికారులు కైలాష్‌ గిరీశ్వర్‌, కే భాగ్యలక్ష్మీ, సాయికుమారి, డిప్యూటీ మేయర్‌ వేమూరి సూర్యనారాయణ తదితరులు ఉన్నారు. 
Advertisement
Advertisement
Advertisement