వక్ఫ్‌బోర్డు భూముల ఆక్రమణపై జేఏసీ ఆందోళన

ABN , First Publish Date - 2021-08-02T05:06:31+05:30 IST

మండలంలోని దామరమడుగులో ముంబై రహదారి పక్కన సర్వే నెంబరు 328లోని వక్ఫ్‌బోర్డుకు చెందిన ఖాజా వారి ఇనాం భూమిని నెల్లూరుకు చెందిన

వక్ఫ్‌బోర్డు భూముల ఆక్రమణపై జేఏసీ ఆందోళన
దామరమడుగులో ఆక్రమణకు గురైన వక్ఫ్‌బోర్డు భూమిలో ఆందోళన చేస్తున్న జేఏసీ నాయకులు, స్థానిక ముస్లింలు.

బుచ్చిరెడ్డిపాళెం, ఆగస్టు 1:  మండలంలోని దామరమడుగులో ముంబై రహదారి పక్కన సర్వే నెంబరు 328లోని వక్ఫ్‌బోర్డుకు చెందిన ఖాజా వారి ఇనాం భూమిని నెల్లూరుకు చెందిన సూర్యనారాయణసింగ్‌ అనే వ్యక్తి ఆక్రమించారంటూ ముస్లిం మైనారిటీ వక్ఫ్‌బోర్డు ఆస్తులు, హక్కుల పరిరక్షణ కమిటీ (జేఏసీ) సభ్యులు ఆదివారం సంబంధిత భూమిలో ఆందోళనకు దిగారు. అనంతరం వారు మాట్లాడుతూ జిల్లాలో వక్ఫ్‌బోర్డు ఆస్తులు ఇప్పటికే చాలా వరకు అన్యాక్రాంతమయ్యాయన్నారు. అయితే సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ పట్టించుకున్న దాఖలాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి అన్యాక్రాంతమైన భూములను తిరిగి వక్ఫ్‌బోర్డుకు అప్పగించకుంటే తీవ్రస్థాయిలో పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు జియావుల్‌ హక్‌, సాబార్‌ఖాన్‌, షబ్బీర్‌, సిరాజ్‌, ఆసిఫ్‌, హమీద్‌, యూనుస్‌తోపాటు 50మందికి పైగా ముస్లింలు పాల్గొన్నారు.  

Updated Date - 2021-08-02T05:06:31+05:30 IST