Abn logo
Aug 12 2020 @ 12:51PM

ట్రీట్ రెడీ చేస్తున్న ‘వకీల్ సాబ్’..?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత ‘వకీల్ సాబ్’లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ మూవీ ‘పింక్‌’కు ఇది రీమేక్. ప‌వ‌న్ ఇందులో లాయ‌ర్ పాత్ర‌ను పోషిస్తున్నారు. ఇప్ప‌టికే సినిమా 80 శాతం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. క‌రోనా ప్ర‌భావంతో సినిమా షూటింగ్ ఆగింది. ఈ క‌రోనాఎఫెక్ట్ త‌గ్గిన త‌ర్వాతే త‌దుప‌రి షెడ్యూల్ ప్లాన్ చేయాల‌ని నిర్మాత‌లు అనుకుంటున్నారు. ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే సెప్టెంబ‌ర్ 2న ప‌వ‌న్‌కల్యాణ్ పుట్టిన‌రోజు ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ అభిమానుల‌ను దృష్టిలో పెట్టుకుని సినిమాకు సంబంధించి టీజ‌ర్‌లాంటిది ఏమైనా రిలీజ్ చేస్తే బావుంటుందని భావించిన నిర్మాత‌లు.. అభిమానుల‌కు ట్రీట్ సిద్ధం చేస్తున్నార‌ని సినీ వ‌ర్గాల్లో వినిపిస్తోన్న స‌మాచారం. వేణుశ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో బోనీక‌పూర్‌, దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

Advertisement
Advertisement
Advertisement