Abn logo
Jan 15 2021 @ 15:56PM

ట్రెండింగ్‌లో `వకీల్ సాబ్`!

దాదాపు మూడేళ్లు వెండితెరకు దూరమైనా పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. రీ-ఎంట్రీలోనూ పవన్ తన స్టామినా చాటారు. వేణు శ్రీరామ్ దర్శక్వత్వంలో పవన్ నటిస్తున్న `వకీల్ సాబ్` టీజర్ సంక్రాంతి సందర్భంగా గురువారం విడుదలైంది. యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. 


ఇప్పటికి 80 లక్షలకు పైగా వ్యూస్‌తో 7.6 లక్షల లైకులతో యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో అగ్రస్థానంలో ఉంది. ఈ టీజర్ సామాన్యులనే కాదు.. సెలబ్రిటీలను సైతం ఆకట్టుకుంది. `పవర్‌స్టార్ ఈజ్ బ్యాక్` అంటూ అందరూ కామెంట్లు చేస్తున్నారు. మెగా ఫ్యామిలీ సభ్యులతోపాటు సినీ పరిశ్రమకు చెందిన పలువురు నటులు, దర్శకులు ఈ టీజర్‌పై ప్రశంసలు కురిపించారు. 


Advertisement
Advertisement
Advertisement