Abn logo
Jul 4 2020 @ 14:36PM

‘వ‌కీల్‌సాబ్’ షూటింగ్ అప్పుడేనా?

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ రీ ఎంట్రీ మూవీ ‘వ‌కీల్ సాబ్‌’. వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో బోనీ క‌పూర్‌, దిల్‌రాజు  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మే 15న సినిమాను విడుద‌ల చేయాల‌ని ముందుగా భావించారు. అయితే క‌రోనా ప్ర‌భావం కార‌ణంగా సినిమా షూటింగ్ ఆగింది. రీసెంట్‌గా ప్ర‌భుత్వం ప‌రిమితులు విధించి షూటింగ్స్‌కు అనుమ‌తులు ఇచ్చినా.. ప‌వ‌న్ షూటింగ్ స్టార్ట్ చేయ‌డానికి ఆస‌క్తి చూప‌డం లేద‌ట. ఆగ‌స్టులో షూటింగ్ ప్రారంభం అవుతుంద‌ని అంద‌రూ అనుకున్నారు కానీ.. సెప్టెంబ‌ర్‌లోనే సినిమా షూటింగ్‌ను స్టార్ట్ చేయాల‌నుకుంటున్నార‌ట‌. వ‌చ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుద‌ల చేసేలా ప్లాన్ చేసుకుంటున్నార‌ట ద‌ర్శ‌క నిర్మాత‌లు . 

Advertisement
Advertisement
Advertisement