Apr 12 2021 @ 12:36PM

'వకీల్‌సాబ్‌' ఓటీటీలోకి వచ్చేస్తున్నాడా?

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం 'వకీల్‌సాబ్‌'. శ్రీరామ్‌ వేణు దర్శకత్వంలో బోనీ కపూర్‌, దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. బాలీవుడ్‌ చిత్రం 'పింక్‌'కు రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రం రీసెంట్‌గా విడుదలై బాక్సాఫీస్‌ వద్ద సత్తాను చాటుతోంది. దాదాపు మూడేళ్ల తర్వాత పవన్‌కళ్యాణ్‌ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తూ చేసిన ఈ సందేశాత్మక చిత్రం విజయవంతంగా రన్‌ అవుతోన్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన మరో వార్తొకటి నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తోంది. అదేంటంటే.. 'వకీల్‌సాబ్‌' సినిమాను వచ్చే ఏప్రిల్‌ 23న డిజిటల్‌ మాధ్యమం అమెజాన్‌లో విడుదల చేయబోతున్నారు. అమెజాన్‌ ప్రైమ్‌ ముప్పై కోట్ల రూపాయలను చెల్లించి డిజిటల్‌ హక్కులను దక్కించుకుంది. అయితే సినిమా విడుదలైన రెండు వారాలకే ఓటీటీలో రానుండటం అనేది డిస్ఠ్రిబ్యూటర్స్‌కు ఇబ్బందికరమైన పరిస్థితే. డిస్ట్రిబ్యూటర్‌, ఎగ్జిబిటర్‌ అయిన దిల్‌రాజు రెండు వారాలకే 'వకీల్‌సాబ్‌'ను ఓటీటీలో విడుదల చేసేలా ఎందుకు అగ్రిమెంట్‌ చేసుకున్నాడనేది ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారింది.