వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలి

ABN , First Publish Date - 2022-08-08T05:30:00+05:30 IST

వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలి

వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలి
పరిగి మండలం నస్కల్‌ పాఠశాలలో వజ్రోత్సవాల్లో పాల్గొన్న ఎంఈవో

వికారాబాద్‌/పూడూర్‌/పరిగి/బొంరా్‌సపేట్‌/కొడంగల్‌, ఆగస్టు 8: భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలను జయప్రదం చేయాలని పలువురు అధికారులు పేర్కొన్నారు. వివిధ శాఖల అధికారులతో సమావేశాన్ని నిర్వహించి వేడులక నిర్వహణపై చర్చించారు. విజయవంతానికి తీసుకోవాల్సిన చర్యలపై మాట్లాడారు. కారాబాద్‌ ఎంపీడీవో సత్తయ్య అన్నారు. సోమవారం మండల పరిషత్‌లో సర్పంచ్‌లకు, ఎంపీటీసీలకు, అధికారులకు, పంచాయతీ కార్యదర్శులకు, ఇతర శాఖల సిబ్బందికి వజ్రోత్సవాల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. వేడుకల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనెలా చూడాలన్నారు. గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి వజ్రోత్సవాల నిర్వహణపై చర్చించాలన్నారు. వైస్‌ ఎంపీపీ కొండి రాములు తదితరులు పాల్గొన్నారు. పూడూర్‌ మండలం కడుమూర్‌ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు మధు ఆధ్వర్య ంలో వజ్రోత్సవాలను నిర్వహించారు. జాతీ య జెండాలు పట్టుకొని విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. పరిగి ఎంఈవో హరిశ్చందర్‌ నస్కల్‌ ప్రాథమిక పాఠశాలలో వజ్రోత్సవాలను ప్రారంభించారు. ఈ నెల 22వ తేదీ వరకు వజ్రోత్సవాలను నిర్వహించాలన్నారు. విద్యార్థులు, ప్రజల్లో దేశభక్తి పెంపొందించేలా కార్యక్రమా లు చేపట్టాలన్నారు. నోడల్‌ అధికారి గోపాల్‌, హెచ్‌ఎంలు వెంకట్‌, పాండు పాల్గొన్నారు. బొంరా్‌సపేట్‌ మండలం చౌదర్‌పల్లి క్లస్టర్‌ పాఠశాల, బాపల్లితండా, పూర్యానాయక్‌ తండా పాఠశాలల్లో ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ను జరుపుకున్నారు. ర్యాలీ నిర్వహించారు. స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకుందామని పిలుపునిచ్చారు. కొడంగల్‌ ఎంపీడీవో పాండు, ఏపీడీ సరళ మండల ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించి ఈ నెల 22 వరకు నిర్వహించే వజ్రోత్సవాల్లో రోజుకో కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. జాతీయ జెండా ఆవిష్కరణతో పాటు మొక్కలు నాటడం, రక్షాబంధన్‌, విద్యార్థులతో ర్యాలీలు, క్రీడాపోటీలు, స్వాతం త్య్ర దినోత్సవాలను ఘనంగా నిర్వహించాలన్నారు. ఏపీవో రాములు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. 


  • పోస్టాఫీసులో జాతీయ జెండాల విక్రయం

బషీరాబాద్‌: బషీరాబాద్‌ పోస్టాఫీసులో జాతీయ జెండాలను విక్రయించారు. 250 జెండాలు రాగా, రూ.25కు ఒక్కటి చొప్పున విక్రయించారు. యువకులు ఈ జెండాలను కొని తీసుకెళ్లారు. ఇంటింటి జెండా కార్యక్రమం కోసం కొనుగోలు చేశామని తెలిపారు.


  • వజ్రోత్సవాల్లో అందరు భాగస్వాములవ్వాలి

మేడ్చల్‌ అర్బన్‌: భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల ను విజయవంతానికి ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని మేడ్చల్‌-మల్కాజిగిరి ఇన్‌చార్జి కలెక్టర్‌ హరీష్‌ సోమవారం పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాలతో వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఈ వజ్రోత్సవాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, యువత పెద్ద ఎత్తున పాల్గొని ప్రతి ఇంటివద్ద జాతీయ జెండాను ఎగురవేసేలా చైతన్య పరచాలన్నారు. 9న జాతీయ పతాకాల పంపిణీ ఉంటుందన్నారు. 10న వన మహోత్సం, ఫ్రీడం పార్కుల ఏర్పాటు, పట్టణాలు, గ్రామాల్లో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. 11న ఫ్రీడం రన్‌, 12న సమైక్యతా రక్షాబంధన్‌, 13న పట్టణాలు, గ్రామాల్లో తిరంగా ర్యాలీలు, 14న నియోజకవర్గ కేంద్రాల్లో జానపద కళాప్రదర్శలు, 15 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగుతాయన్నారు. 16న సామూహిక జాతీయ గీతాలాపన, 17న రక్తదాన శిబిరాలు, 18న క్రీడాపోటీలు నిర్వహిస్తామన్నారు. 19న ఆస్పత్రులు, వృద్ధాశ్రమాల్లో పండ్ల పంపిణీ, 20న ముగ్గుల పోటీలు, 21 ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తామన్నారు.

Updated Date - 2022-08-08T05:30:00+05:30 IST