ప్రణాళికతో వజ్రోత్సవాలు నిర్వహించాలి

ABN , First Publish Date - 2022-08-11T06:03:03+05:30 IST

జిల్లాలో పక్కా ప్రణా ళికతో వజ్రోత్సవాలు నిర్వహించాలని కలెక్టర్‌ గుగులోతు రవి నాయక్‌ అధికారులను ఆదేశించారు.

ప్రణాళికతో వజ్రోత్సవాలు నిర్వహించాలి
వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్న కలెక్టర్‌ రవి, అధికారులు

కలెక్టర్‌ గుగులోతు రవి నాయక్‌

జగిత్యాల, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పక్కా ప్రణా ళికతో వజ్రోత్సవాలు నిర్వహించాలని కలెక్టర్‌ గుగులోతు రవి నాయక్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం పట్టణంలోని కలెక్టరేట్‌ కార్యాలయ సమావేశ మందిరం నుంచి జూమ్‌ యాప్‌ ద్వారా పలువురు అధికారులతో స్వతంత్య్ర భారత వజ్రోత్సవాల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ రవి నాయక్‌ మాట్లాడారు. జిల్లాలో ఈనెల 11వ తేది ఉదయం 6.30 నిమిషాలకు ర్యాలీ ఉంటుందని నోడల్‌ ఆఫీసర్లు, పోలీసు అధికారులు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ప్రతీ కార్యక్ర మానికి ముందస్తుగా ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. జాతీయ జెండా ఆవిష్కరణలు, స్వీట్లు పంపిణీ, గాంధీ సినిమా ప్రదర్శన కార్యక్రమాలు ఉత్సవాలు ముగిసే వరకు ప్రతినిత్యం కొనసాగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సింధూ శర్మ, అదనపు కలెక్టర్లు బీఎస్‌ లత, అరుణ శ్రీ, సీపీఓ పూర్ణ చందర్‌, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-08-11T06:03:03+05:30 IST