స్వాతంత్య్ర కాంక్ష స్ఫురించేలా వజ్రోత్సవాలు జరుపుకోవాలి

ABN , First Publish Date - 2022-08-14T04:33:05+05:30 IST

స్వాతంత్య్ర కాంక్ష స్ఫురించేలా వజ్రోత్సవాలు జరుపుకోవాలని రాష్ట్రఅటవీ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలో శనివారం కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ ఆధ్వ ర్యంలో నిర్వహించిన ఫ్రీడం ర్యాలీ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

స్వాతంత్య్ర కాంక్ష స్ఫురించేలా వజ్రోత్సవాలు జరుపుకోవాలి
ఆసిఫాబాద్‌లో 75 ఆకారంలో కూర్చున్న విద్యార్థులు

- అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి

ఆసిఫాబాద్‌, ఆగస్టు 13: స్వాతంత్య్ర కాంక్ష స్ఫురించేలా వజ్రోత్సవాలు జరుపుకోవాలని రాష్ట్రఅటవీ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలో శనివారం కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ ఆధ్వ ర్యంలో నిర్వహించిన ఫ్రీడం ర్యాలీ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా అటవీ శాఖ కార్యాలయానికి వచ్చిన ఆయనకు కలెక్ట ర్‌తోపాటునాయకులు ఘనస్వాగతం పలి కారు. జిల్లా అటవీశాఖ కార్యాలయంనుంచి బైక్‌ర్యాలీగా వెళ్లినమంత్రి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు చేరుకున్నారు. అక్కడే ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్ర దినోత్సవ కాంక్షను స్ఫుర్తించేలా నిర్వహిం చుకోవాలన్నారు. ఈనెల22వరకు ప్రత్యేక కార్యక్ర మాలు ప్రతీరోజు నిర్వహించాలన్నారు. ఈ నెల 21న మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలన్నారు. గతంతో పోలిస్తే జిల్లా ఎంతగానో అభివృద్ధి చెందిందని ఇది తమ ప్రభుత్వంతోనే సాధ్యమైందన్నారు. కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ ఫ్రీడమ్‌ ర్యాలీ విజయవంతం కావడానికి కృషి చేసిన ప్రతిఒక్కరికీ అభినందనలు తెలిపారు. అనంతరం పాఠశాలగ్రౌండ్‌లో జాతీయజెండా సూచిం చే విధంగా బెలూన్లను గాల్లోకి ఎగురవేశారు. కార్యక్ర మంలో ఐటీడీఏ పీవో వరుణ్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌లు రాజేశం, చాహత్‌బాజ్‌పాయ్‌, ఎస్పీ సురేష్‌కుమార్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి, ఎమ్మెల్సీ దండే విఠల్‌, ఎమ్మెల్యే ఆత్రం సక్కు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-14T04:33:05+05:30 IST