చరిత్ర చాటేందుకే వజ్రోత్సవాలు

ABN , First Publish Date - 2022-08-11T05:15:22+05:30 IST

చరిత్ర చాటేందుకే వజ్రోత్సవాలు

చరిత్ర చాటేందుకే వజ్రోత్సవాలు
ఆమనగల్లు: మొక్కలు నాటుతున్న ఎంపీ రాములు, ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌

  • ఎంపీ రాములు, ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ 
  • స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా వనమహోత్సవం 
  • మొక్కలు నాటిన ప్రజాప్రతినిధులు, అధికారులు


ఆమనగల్లు/కడ్తాల్‌/చేవెళ్ల/మొయినాబాద్‌ రూరల్‌/షాబాద్‌/షాద్‌నగర్‌అర్బన్‌/షాద్‌నగర్‌రూరల్‌/కొందుర్గు/నందిగామ/కేశంపేట/ ఇబ్రహీం పట్నం/ఆదిభట్ల/యాచారం/మహేశ్వరం/కందుకూరు/శంషాబాద్‌, ఆగస్టు 10: స్వాతంత్య్ర సమరయోధుల చరిత్రను చాటేందుకే రాష్ట్ర ప్రభుత్వం స్వాతంత్య్ర వజ్రోత్సవాలను నిర్వహిస్తోందని నాగర్‌కర్నూల్‌ ఎంపీ రాములు, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపల్‌యాదవ్‌ అన్నారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా బుధవారం జిల్లాలోని ఆయా మండలాల్లో వన మహోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమనగల్లులోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీ, ఎమ్మెల్యేలు మొక్కలు నాటారు. కడ్తాలలో ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ ప్రజాప్రతినిధులకు జాతీయ పతాకాలను పంపిణీ చేశారు. అనంతరం శ్రీనివాస థియేటర్‌లో విద్యార్థులు, ప్రజాప్రతినిధులతో కలిసి గాంధీ చిత్రాన్ని తిలకించారు. ఎంపీపీలు కమ్లీమోత్యనాయక్‌, అనితవిజయ్‌, జడ్పీటీసీలు జర్పుల దశరథ్‌నాయక్‌, అనురాధపత్యానాయక్‌, మార్కెట్‌ చైర్మన్‌ నాలాపురం శ్రీనివా్‌సరెడ్డి, వై్‌స్‌చైర్మన్‌ తోట గిరియాదవ్‌, గంప వెంకటేశ్‌, గూడూరు లక్ష్మీనర్సింహ్మరెడ్డి, జోగు వీరయ్య, సీఐ జాల ఉపేందర్‌, ఎస్‌ఐలు ధర్మేశ్‌, హరిశంకర్‌గౌడ్‌ పాల్గొన్నారు. కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయం ఆవరణలో  సీఐ జాల ఉపేందర్‌ మొక్కలు నాటారు. ఎస్‌ఐ ధర్మేశ్‌, ఎ్‌సవో పద్మజ్యోతి పాల్గొన్నారు. అదేవిధంగా కడ్తాల్‌ మండలంలోని అన్మా్‌సపల్లి గ్రామ సమీపంలోని అటవీశాఖ భూమిలో మూడెకరాల్లో అటవీ శాఖ, కౌన్సిలర్‌ ఫరల్‌ గ్రీన్‌ రెవల్యూషన్‌ ఆధ్వర్యంలో ఫ్రీడమ్‌పార్క్‌ను ఏర్పాటు చేయగా డిప్యూటీ ఫారెస్ట్‌ రేంజర్‌ హేమ ప్రారంభించారు. సర్పంచ్‌ శంకర్‌, ఉప సర్పంచ్‌ పాల్గొన్నారు. చేవెళ్ల, మొయినాబాద్‌లో  వన మహోత్సవంలో భాగంగా ఎమ్మెల్యే కాలె యాదయ్య మొక్కలు నాటారు. ఎంపీపీలు విజయలక్ష్మి, నక్షత్రం, జడ్పీటీసీ మాలతి, శ్రీకాంత్‌, సర్పంచ్‌ శైలజాఆగిరెడ్డి, ఎంపీడీవో రాజ్‌కుమార్‌, తహసీల్దార్‌ శ్రీనివాస్‌ ఉన్నారు. అదేవిధంగా కడ్తాల్‌లోని పీఎ్‌సలో ట్రాఫిక్‌ సీఐ గురువయ్యగౌడ్‌, సీఐ వెంకటేశ్వర్లు మొక్కలు నాటారు. ఎస్‌ఐలు తిరుపతిరావు, హయుబ్‌, ప్రదీ్‌పకుమార్‌, ఏఎ్‌సఐ చందర్‌నాయక్‌ ఉన్నారు. షాబాద్‌ మండలంలోని కక్కులూర్‌లో గల క్రీడామైదానంలో జడ్పీటీసీ పట్నం అవినా్‌షరెడ్డి, ఎంపీపీ కోట్ల ప్రశాంతిమహేందర్‌రెడ్డి 75మొక్కలు నాటారు. తహసీల్దార్‌ సైదులుగౌడ్‌, ఎంపీడీవో అనురాధ, మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం భారీవర్షాలకు నిండిన మాలకుంటను పరిశీలించారు. సీఐ అశోక్‌, ఎస్‌ఐ బాల్‌రాజ్‌, మహేశ్‌రెడ్డి, ఏఎ్‌సఐ శంకర్‌రెడ్డి ఉన్నారు. అదేవిధంగా షాద్‌నగర్‌లోని 7వ వార్డులో ఏర్పాటు చేసిన ఫ్రీడమ్‌ పార్కును శంషాబాద్‌ డీసీపీ జగదీశ్వర్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ ప్రారంభించారు. అదేవిధంగా ఫ్రీడమ్‌పార్కు శిలాఫలకాన్ని   శంషాబాద్‌ డీసీపీ జగదీశ్వర్‌రెడ్డితో కలిసి ఆవిష్కరించారు.  అనంతరం పార్కులో ఆర్డీవో రాజేశ్వరీ, మున్సిపల్‌ చైర్మన్‌ కె.నరేందర్‌తో కలిసి మొక్కలు నాటారు. జాతీయజెండాను ఆవిష్కరించారు. ఏసీపీ కుషాల్కర్‌, సీఐలు నవీన్‌కుమార్‌, రామయ్య, మున్సిపల్‌ కమిషనర్‌ జయంత్‌కుమార్‌రెడ్డి, మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ నటరాజ్‌, ఎంపీపీ ఖాజాఇద్రీష్‌ అహ్మద్‌, జడ్పీటీసీ పి.వెంకట్‌రాంరెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు. అదేవిధంగా నందిగామలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఫరూఖ్‌నగర్‌ పరిధి కమ్మదనం గ్రామంలో ఎమ్మెల్యే మొక్కలు నాటారు. జడ్పీ వైస్‌చైర్మన్‌ గణేష్‌, ఎంపీపీ ఖాజాఇద్రీస్‌, జడ్పీటీసీ వెంకట్‌రాంరెడ్డి,, కొత్తూరు మండల తహసీల్దార్‌ రాములు, ఎంపీడీవోలు శరత్‌చంద్ర, వినయ్‌ పాల్గొన్నారు. షాద్‌నగర్‌ పట్టణంలోని వ్యాపారులు, చిల్లర వర్తకులకు జాతీయ జెండాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్‌ నేతలు శ్రీవర్దన్‌రెడ్డి, పాలమూరు విష్ణువర్దన్‌రెడ్డి, అందెబాబయ్య, రుషికేష్‌, నర్సింహులు, చెట్ల వెంకటేశ్‌ పాల్గొన్నారు. కొందుర్గులో కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి వీర్లపల్లి శంకర్‌ స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా పాత ఆగిర్యాలలో పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి కొత్త ఆగిర్యాల, వెంకిర్యాల, తంగళ్లపల్లి, విశ్వనాథ్‌పూర్‌, చెర్కుపల్లి, గంగన్నగూడెం కొందుర్గు వరకు పాదయాత్రను నిర్వహించారు. అదేవిధంగా కేశంపేటలో  బీజేపీ మండల అధ్యక్షుడు పసుల నరసింహ యాదవ్‌, రాఘురాములు గౌడ్‌, మల్లేష్‌, మోటే శ్రీనివాస్‌, మధుసూదన్‌గౌడ్‌, సంతో్‌షగుప్త, శివాజీ, యుగందర్‌, పాండరంగారెడ్డి తదితరులు జాతీయ జెండాలతో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. మండల పరిషత్‌ కార్యాలయం ఆవరణలో ఎంపీపీ రవీందర్‌, జడ్పీటీసీ తాండ్ర విశాల, ఎంపీడీవో రవిచంద్రకుమార్‌రెడ్డిలు మొక్కలు నాటారు. జాతీయ జెండాలను ఆవిష్కరించారు. అదేవిధంగా ఇబ్రహీంపట్నంలోని చెర్లపటేల్‌గూడలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా వన మహోత్సవంలో పాల్గొని మొక్కలు నాటారు. ఎంపీపీ పి.కృపేష్‌, వైస్‌ఎంపీపీ మంచిరెడ్డి వెంకటప్రతా్‌పరెడ్డి, ఏసీపీ ఉమామహేశ్వర్‌రావు, సీఐ ఆర్‌ సైదులు, ఎంపీడీవో క్రాంతి కిరణ్‌, ఎంఈవో కె.వెంకట్‌రెడ్డి, సర్పంచ్‌ గీతారాంరెడ్డి, ఎంపీటీసీ ఆంజనేయులు ఉన్నారు. అనంతరం ఇబ్రహీంపట్నం చెరువులోకి వరద నీరువచ్చి చేరి నీటి మట్టం 30 అడుగులకు చేరగా ఎమ్మెల్యే చెరువును సందర్శించారు. లీకేజీలు లేకుండా చర్యలు చేపట్టాలని ఇరగేషన్‌ అధికారులను ఆదేశించారు. ఇబ్రహీంపట్నం మున్సిపల్‌ కార్యాలయంలో చైర్‌పర్సన్‌ కప్పరి స్రవంతి, కమిషనర్‌ మహ్మద్‌ యూసు్‌ఫలు మొక్కలు నాటారు. బ్రహ్మకుమారి హేమలత, మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు. కాగా మున్సిపాలిటీలో 8వ వార్డులో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఆకుల యాదగిరి, కమిషనర్‌ యూసు్‌ఫలు ఇంటింటికీ జాతీయ జెండాలను పంపిణీ చేశారు. ఆదిభట్ల ప్రభుత్వ పాఠశాలలో హెచ్‌ఎం వర్కాల పరమేశ్‌ 75పండ్ల మొక్కలను విద్యార్థులకు పంపిణీ చేశారు. దేశభక్తి గీతాల పోటీలు నిర్వహించి గాంధీ సినిమాను ప్రదర్శించినట్లు తెలిపారు. గురువారం  ఉదయం 7గంటలకు ఫ్రీడమ్‌రన్‌ ఉంటుందని కమిషనర్‌ అమరేందర్‌రెడ్డి తెలిపారు. యాచారంలో ఎంపీపీ కొప్పు సుకన్యబాషా, ఎంపీడీవో విజయలక్ష్మి, తహసీల్దార్‌ సుచరిత, ఏపీవో లింగయ్య తదితరులు మొక్కలు నాటారు.  కందుకూరులోని ఆయా పంచాయతీల్లో సర్పంచులు జాతీయ జెండాలను ఆవిష్కరించారు. సర్పంచులు కళమ్మరాజు, శ్రావణి, గోపాల్‌రెడ్డి, జ్యోతి, వసంత, అనితశ్రీనివాస్‌, పరంజ్యోతి, బాలమణి పాల్గొన్నారు. అదేవిధంగా శంషాబాద్‌ మున్సిపాలిటీలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సుష్మారెడ్డి 18వ వార్డులో అన్నిబస్తీల కౌన్సిలర్లకు జాతీయ జెండాలను పంపిణీ చేశారు. శంషాబాద్‌లో మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకా్‌షగౌడ్‌ ఎంపీపీ జయమ్మశ్రీనివాస్‌, జడ్పీటీసి తన్వీరాజులతో కలసి మొక్కలు నాటారు. ఎంపీపీ దుద్యాల జయమ్మశ్రీనివాస్‌, జడ్పీటీసీ తన్వీరాజు పాల్గొన్నారు. స్థానిక పీఎ్‌సలో డీసీపీ జగదీవ్వర్‌రెడ్డి, ఏసీపీ భాస్కర్‌, సీఐ శ్రీధర్‌లు మొక్కలు నాటారు. 

 

Updated Date - 2022-08-11T05:15:22+05:30 IST