వజ్రోత్సవాలను అట్టహాసంగా నిర్వహించాలి

ABN , First Publish Date - 2022-08-09T06:01:52+05:30 IST

భారత స్వాతంత్య్ర శోభ ప్రతిబింబించేలా వజ్రోత్సవాలను అట్టహాసంగా నిర్వహించాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. జిల్లా వ్యాప్తంగా నిర్దేశిత కార్యక్రమాలను పెద్దఎత్తున చేపట్టేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ నుంచి వజ్రోత్సవాల నిర్వహణపై కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని శాఖల అధికారులతో సమీక్షించారు.

వజ్రోత్సవాలను అట్టహాసంగా నిర్వహించాలి

నిజామాబాద్‌ అర్బన్‌, ఆగస్టు 8: భారత స్వాతంత్య్ర శోభ ప్రతిబింబించేలా వజ్రోత్సవాలను అట్టహాసంగా నిర్వహించాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. జిల్లా వ్యాప్తంగా నిర్దేశిత కార్యక్రమాలను పెద్దఎత్తున చేపట్టేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ నుంచి వజ్రోత్సవాల నిర్వహణపై కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని శాఖల అధికారులతో సమీక్షించారు. ఉత్సావాల నిర్వహణ కోసం మండల, మున్సిపల్‌, జిల్లా స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. ఈ నెల 9న ఉదయం 10.30 గంటలకు నగర శివారులోని భూమారెడ్డి కన్వెన్షన్‌హాల్‌లో జిల్లా స్థాయి వజ్రోత్సవాలను మంత్రి ప్రశాంత్‌రెడ్డి ప్రారంభిస్తారన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు విధిగా పాల్గొనాలన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో త్రివర్ణ పతాకాలను అందించడం జరుగుతుందని వీటిని 12వ తేదీ సాయంత్రంలోపు ఎంపీడీవోల ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులు స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో ఇంటింటికీ పంపిణీ చేయాలన్నారు. ప్రతిచోట ఫ్లాగ్‌ కోడ్‌ అమలయ్యేలా చూడాలని, జాతీయ జెండా గౌరవానికి భంగం కలకుండా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.  ఆగస్టు 15 సందర్భంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలన్నారు. జెండాను ఏ సమయం వరకైనా.. ఎన్ని రోజులైనా ఉంచవచ్చని ఈ విషయంలో ఎలాంటి ఆంక్షలు లేవన్నారు. ఫ్లాగ్‌ కోడ్‌ మాత్రం ఖచ్చితంగా అమలు చేయాలన్నారు. 10వ తేదీ వన మహోత్సవం జరపాలని కనీసం 75 మొక్కలకు తగ్గకుండా నాటి ఆ ప్రాంతానికి ఫ్రీడం పార్క్‌గా నామకరణం చేయాలన్నారు. 11వ తేదీ ఫ్రీడం ర్యాలీ, 12న జాతీయ సమైఖ్యత రక్షాబంధన్‌, 13న ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులచేత ర్యాలీ, 14న సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు, 15న స్వాతంత్ర దినోత్సవం, 16న జిల్లావ్యాప్తంగా ఒకే సమయంలో జాతీయ గీతాలాపన ఉంటుందని అన్ని పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో తప్పనిసరిగా నిర్ణీత సమయంలో ఈ కార్యక్రమం జరగాలన్నారు. 17న రక్తదాన శిబిరాలు, 18న క్రీడాపోటీలు నిర్వహించాలన్నారు. అలాగే 10వ తేదీన దేశభక్తి గీతాలాపన పోటీలు, 11న వ్యాసరచన, 12న క్రీడాపోటీలు, 15న ప్రభాత్‌భేరీ, ఫ్యాన్సీ డ్రెస్‌ కాంపిటీషన్‌, 16న వకుృత్వ పోటీలు, 17న పేయింటింగ్‌  పోటీలను పాఠశాల, కళాశాల స్థాయిలో వేర్వేరుగా విద్యార్థులకు నిర్వహించాలన్నారు. 9వ తేదీ నుంచి ఉదయం 10గంటల నుంచి 1.15 వరకు గాంధీ సినిమాను ఉచితంగా ప్రదర్శించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. వీసీలో పోలీస్‌ కమిషనర్‌ నాగరాజు, అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, చిత్రమిశ్రా, జడ్పీ సీఈవో గోవింద్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-09T06:01:52+05:30 IST