వజ్రోత్సవాలు విజయవంతం చేయాలి

ABN , First Publish Date - 2022-08-11T05:21:40+05:30 IST

స్వాతంత్య్ర భారత వజ్రోత్సవ వేడుకలను ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా అన్నారు.

వజ్రోత్సవాలు విజయవంతం చేయాలి
75 వసంతాల ఆకారంలో ఏర్పాటుచేసిన ప్లాంటేషన్‌

- కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌బాషా 


వనపర్తి టౌన్‌, ఆగస్టు 10: స్వాతంత్య్ర భారత వజ్రోత్సవ వేడుకలను ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పాలి టెక్నిక్‌ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన ఫ్రీడం పార్కును ఆమె పరిశీలించి, మాట్లాడారు. స్వాతం త్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయిన సంద ర్భంగా ఈనెల 8 నుంచి 22 వరకు వినూత్న కార్యక్ర మాలు జిల్లా అంతటా నిర్వహించనున్నామన్నారు. వేడుకల్లో ప్రజలందరూ పెద్దఎత్తున భాగస్వాములై దేశభక్తిని, జాతీయభావాన్ని ఘనంగా చాటాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మొక్కలు నాటి, నీరు పోశారు. 75 సంవత్సరాల ఆకారంలో ఏర్పాటు చేసిన ప్లాంటేషన్‌ గుర్తు అందరినీ ఆకర్షించింది. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ (లోకల్‌బాడీ) ఆశిష్‌ సంగ్వాన్‌, మునిసిపల్‌ చైర్మన్‌ గట్టుయాదవ్‌, వైస్‌ చైర్మన్‌ వాకిటి శ్రీధర్‌, కమిషనర్‌ విక్రమసింహరెడ్డి, ఏఈ భాస్కర్‌, కౌన్సిలర్‌ పెండెం నాగన్నయాదవ్‌, పాకనాటి కృష్ణ, నాయకులు మధుసూదన్‌గౌడ్‌, ప్రేమ్‌నాథ్‌రెడ్డి, కళాశాల ప్రిన్సి పాల్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు, మెప్మా ఆర్పీలు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-11T05:21:40+05:30 IST