ప్రణాళికాబద్ధంగా వజ్రోత్సవాలను నిర్వహించాలి

ABN , First Publish Date - 2022-08-10T06:02:11+05:30 IST

స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ప్రణాళికతో ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ కలెక్టర్లను ఆదేశించారు.

ప్రణాళికాబద్ధంగా వజ్రోత్సవాలను నిర్వహించాలి
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌, జిల్లా అధికారులు

కరీంనగర్‌, ఆగస్టు9(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ప్రణాళికతో ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ కలెక్టర్లను ఆదేశించారు. వజ్రోత్సవాల నిర్వహణపై హైదరాబాద్‌ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 10 నుంచి ప్రతి గ్రామం, మున్సిపాలిటీ పరిధిలో ఫ్రీడం పార్కు కింద కనీసం 75 మొక్కలు నాటాలని పేర్కొన్నారు. 11న ప్రతి మండల కేంద్రంలో ఫ్రీడం రన్‌, 12న జాతీయ సమైక్యత కోసం రక్షాబంధన్‌ నిర్వహణ, 13న ప్రతి గ్రామంలో, మున్సిపాలిటీలలో జాతీయ జెండా, ఫ్లకార్డులతో విద్యార్థులు, ఉద్యోగులతో ఫ్రీడం ర్యాలీ నిర్వహిం చాలని తెలిపారు. 14న ప్రతి నియోజకవర్గంలో జానపద కళారూపాల ప్రదర్శన ఏర్పాటు చేయాలని, 119 బృందాలు సిద్ధం చేసి సన్నద్ధంగా ఉండాలని తెలిపారు. 16న ఉదయం 11 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి సామూహికంగా జాతీయ గీతాలాపన చేయాలని సీఎస్‌ పేర్కొన్నారు. ఆగస్టు 17న ప్రతి నియోజకవర్గంలో బ్లడ్‌ డొనేషన్‌ క్యాంపు లు ఏర్పాటు చేయాలని తెలిపారు. జిల్లాలో ప్రతి గ్రామం పరిధిలో క్రీడా పోటీలు నిర్వహించాలని, 11, 12న గ్రామ స్థాయిలో, 13, 14న మండల స్థాయిలో 16, 17న జిల్లా స్థాయి పోటీలు నిర్వహించాలని, 18న ఫ్రీడం కప్‌ పోటీలు నిర్వహించి విజేతలను నిర్ణయించాలని తెలిపారు. 19న జిల్లాలో ఉన్న ప్రతి వృద్ధాశ్రమం, ఆసుపత్రి, అనాథ శరణాలయాల్లో స్వీట్‌, పండ్లు పంపిణీ జరగాలని, 20న రంగోలి పోటీలు, 21న గ్రామ పంచాయతీ, మండల, జడ్పీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. ప్రతిరోజు నిర్వహించే కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు సంబంధిత సమాచారంతో నివేదికలు పంపాలని ఆదేశించారు. 

ఫఈ సందర్భంగా కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ మాట్లా డుతూ జిల్లాలో ఇప్పటికే 2 లక్షల జాతీయ జెండా లను స్వీకరించి, జాతీయ జెండాలను ఇంటింటా పంపిణీ కార్యక్రమం మొదలు పెట్టామన్నారు. జిల్లావ్యాప్తంగా 9, 10, 11 తేదీలతోపాటు 16 నుంచి 21 తేదీ వరకు 30 వేల మంది పిల్లల కొరకు 13 సినిమా థియేటర్ల ద్వారా గాంధీ చిత్రాన్ని ప్రదర్శించేలా చర్యలు తీసుకున్నాని పేర్కొన్నారు. మంగళవారం 12 సినిమా థియేటర్ల ద్వారా 5268 మంది పిల్లలకు గాంధీ సినిమాను ప్రదర్శించామన్నారు. 

ఫఅనంతరం కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో జిల్లా కలెక్టర్‌ అధికారులతో మాట్లాడుతూ అధికారులు టీం వర్క్‌తో పనిచేసి వజ్రోత్సవాలను విజయవంతం చేయాల న్నారు. 10న ప్రతి గ్రామం మున్సి పాలి టీలో ఫ్రీడం పార్కులో 75 మొక్కలు నాటాలని అన్నారు. 11న అంబేద్కర్‌ విగ్రహం నుంచి ఆర్ట్స్‌ కళాశాల వరకు జరిగే ఫ్రీడం రన్‌ను జిల్లాలో విజయవంతం చేయాలన్నారు. 14వ తేదీన జానపద కళాకారులతో అమరవీరుల స్థూపం నుంచి ఆడిటోరియం వరకు ర్యాలీ నిర్వహించి దేశభక్తి గీతాలను పాడించాలని అన్నారు. 15న ఫ్రీడం ఫైటర్లతోపాటు ఉత్తమ సేవలను అందిస్తున్న పలువురు ప్రముఖులను గుర్తించి వారిని మెమోంటోలతో సత్కరించాలని సూచించారు. 16న సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో ప్రతి ఒక్క పౌరుడు పాల్గొనేలా చూడాలని పేర్కొన్నారు.  కార్యక్రమంలో  సీపీ సత్యనారాయణ, అదనపు కలెక్టర్లు గరిమ అగర్వాల్‌, శ్యాంప్రసాద్‌లాల్‌, మున్సిపల్‌ కమిషనర్‌ సేవా ఇస్లావత్‌, డీఈవో జనార్ధన్‌రావు, జిల్లా యువజన క్రీడాధికారి రాజీవీరు, డీఆర్‌డీవో శ్రీలత, మెప్మా పీడీ రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-10T06:02:11+05:30 IST