Abn logo
Jan 26 2021 @ 19:49PM

ఫైనల్‌గా.. ‘ఉప్పెన’ రిలీజ్‌ డేట్‌ ఫిక్సయింది

సుప్రీమ్‌ హీరో సాయితేజ్‌ తమ్ముడు పంజా వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా పరిచయం అవుతోన్న చిత్రం 'ఉప్పెన'. ఈ చిత్ర విడుదల విషయంలో ఇప్పటి వరకు ఎటువంటి న్యూస్‌లు వచ్చాయో తెలియంది కాదు. ఎట్టకేలకు ఈ చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 12న విడుదల చేయబోతోన్నట్లుగా చిత్రయూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్న ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్‌గా న‌టిస్తుండగా తమిళ స్టార్‌ నటుడు విజయ్‌ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నారు. బుచ్చిబాబు సానా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్న ఈ మూవీని సుకుమార్ రైటింగ్స్ సహకారంతో మైత్రి మూవీ మేకర్స్  సంస్థ నిర్మించింది. 


ఇప్పటికే సంగీతంలో త‌న‌ అభిరుచికి, పాట‌ల‌ను ప్రెజెంట్ చేసిన విధానంతో అంద‌రి దృష్టినీ త‌న‌వైపుకు తిప్పుకున్న బుచ్చిబాబు సానా  ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డంతో పాటు క‌థ‌, స్క్రీన్‌ప్లే, సంభాష‌ణ‌ల‌ను కూడా అందించారు. ఇటీవ‌ల రిలీజైన ఈ సినిమా టీజ‌ర్‌ ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. వైష్ణ‌వ్ తేజ్‌, కృతి శెట్టి వారి స్క్రీన్ ప్ర‌జెన్స్‌తో ప్ర‌తి ఒక్క‌రిని ఆక‌ట్టుకున్నారు. దేవి శ్రీ ప్ర‌సాద్ స్వ‌రాలు స‌మ‌కూర్చ‌గా ఇప్ప‌టికే విడుద‌లైన అన్ని పాట‌లు శ్రోత‌ల‌‌ను అల‌రిస్తున్నాయి. పాటలు, టీజర్‌ విడుదల తర్వాత ఈ సినిమా కోసం ప్రేక్షకులు కూడా వెయిట్‌ చేస్తున్నారు. ఫైనల్‌గా ఫిబ్రవరి 12న మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు‌.



Advertisement
Advertisement
Advertisement