May 8 2021 @ 12:22PM

వైష్ణవ్ తేజ్ నెక్ట్ మూవీ... డైరెక్ట్ ఓటీటీ రిలీజ్

డెబ్యూ మూవీ ‘ఉప్పెన’తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన మెగా క్యాంప్ హీరో వైష్ణ‌వ్ తేజ్ వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. తొలి సినిమా తర్వాత వైష్ణవ్ తేజ్, క్రిష్ కాంబోలో రూపొందిన చిత్రం ఓటీటీలోనే డైరెక్ట్‌గా విడుదల కానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..‘ఉప్పెన’ రిలీజ్ కాక ముందే వైష్ణవ్ తేజ్.. డైరెక్ట‌ర్ క్రిష్ ద‌ర్శ‌కత్వంలో ర‌కుల్ ప్రీత్ సింగ్‌తో క‌లిసి ఓ సినిమాలో న‌టించిన సంగ‌తి తెలిసిందే. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా పూర్త‌య్యాయ‌ట‌. అయితే ఇప్ప‌టి ప‌రిస్థితుల్లో సినిమాను థియేట‌ర్స్‌లో విడుద‌ల చేసే అవ‌కాశం లేదు. ఆ కార‌ణంగా వైష్ణ‌వ్ తేజ్ రెండో సినిమాను డైరెక్ట్‌గా తెలుగు ఓటీటీ ‘ఆహా’లో విడుద‌ల చేయడానికి క్రిష్ నిర్ణ‌యించుకున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌రి నెట్టిం వినిపిస్తోన్న ఈ వార్త‌లపై క్రిష్ ఏమైనా స్పందిస్తాడేమో చూడాలి.