Jun 26 2021 @ 08:03AM

షైన్ స్క్రీన్స్ బ్యానర్‌లో వైష్ణవ్ తేజ్..?

షైన్ స్క్రీన్స్ బ్యానర్‌లో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ సినిమా చేయబోతున్నాడనే వార్త ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అక్కినేని నాగచైతన్య హీరోగా వచ్చిన 'మజిలీ' సినిమాతో నిర్మాణ రంగంలోకి దిగిన మేకర్స్ హరీష్ పెద్ది - సాహు గారపాటి. వీరు షైన్ స్క్రీన్స్ బ్యానర్‌ను స్థాపించి 'మజిలీ' సినిమాతో తొలి విజయాన్ని అందుకున్నారు. ఇటీవల డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన 'గాలి సంపత్' చిత్రాన్ని రిలీజ్ చేశారు. ప్రస్తుతం నాని - శివ నిర్వాణ కాంబినేషన్‌లో 'టక్ జగదీష్' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్‌కి రెడీగా ఉంది. థియోటర్స్ ఓపెన్ అవగానే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. కాగా 'ఉప్పెన' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్‌తో హరీష్ పెద్ది - సాహు గారపాటి ఓ సినిమా నిర్మించనున్నారని టాక్ వినిపిస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు 'టక్ జగదీష్' రిలీజ్ తరువాత వెల్లడికానున్నాయని సమాచారం.