Abn logo
Jul 4 2020 @ 09:12AM

రెండో సినిమాకు ఓకే చెప్పిన వైష్ణవ్ తేజ్

మెగా క్యాంప్ హీరోల్లో ఒకరైన సాయితేజ్ హీరోగా త‌న‌కుంటూఓ గుర్తింపు సంపాదించుకున్నారు. ‘ఉప్పెన‌’ చిత్రంతో సాయితేజ్ సోద‌రుడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఏప్రిల్ 2న ‘ఉప్పెన‌’ విడుద‌ల కావాల్సింది. కానీ క‌రోనా కార‌ణంగా విడుద‌ల ఆగింది. అయితే తొలిసినిమా ఉప్పెన విడుద‌ల కాకుండానే రెండో సినిమాలో వైష్ణవ్ తేజ్ న‌టించ‌డానికి ఓకే చెప్పేశాడ‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. భారీ బడ్జెట్ చిత్రాల‌తో పాటు కంటెంట్ బాగుంటే మినిమం బ‌డ్జెట్ చిత్రాల‌ను నిర్మించే సంస్థ యువీ క్రియేష‌న్స్‌. ఈ బ్యాన‌ర్‌లో వైష్ణ‌వ్ తేజ్ త‌న రెండో సినిమా చేయ‌బోతున్నాడ‌ని టాక్‌. ఈ సినిమాను కూడా ఓ కొత్త డైరెక్ట‌రే తెర‌కెక్కించ‌బోతుత‌న్నాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. 

Advertisement
Advertisement
Advertisement