వైకుంఠధామం, డంపింగ్‌ యార్డులను వాడుకలోకి తేవాలి

ABN , First Publish Date - 2022-05-20T06:46:01+05:30 IST

వైకుంఠ ధామం, డంపింగ్‌యార్డు వాడుకలో ఉండే విధంగా చూడాలని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ అన్నారు.

వైకుంఠధామం, డంపింగ్‌ యార్డులను వాడుకలోకి తేవాలి
వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌

కామారెడ్డి, మే 19: వైకుంఠ ధామం, డంపింగ్‌యార్డు వాడుకలో ఉండే విధంగా చూడాలని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గురువారం మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకుంఠ ధామంలో నీటి వసతి, విద్యుత్‌ సౌకర్యం కల్పించాల ని తెలిపారు. అన్ని గ్రామాల్లో మరుగుదొడ్లు ప్రజలు వినియోగించుకునే విధంగా అవగాహన కల్పించాలని తెలిపారు. హరితహారంలో మొక్కలు నాటడానికి గ్రామాల్లో ఖాళీ స్థలాలను అధికారులు గుర్తించాలని తెలిపారు. గ్రామాల్లో తడి, పొడి చెత్తను వేరుచేసి సేంద్రియ ఎరువులను తయారు చేయాలని పేర్కొన్నారు. గ్రామాల్లో నీటి ట్యాంకులను వారం రోజులకు ఒక సారి శుభ్రం చేయాలని సూచించారు. చెరువుకట్టపైన హరితహారంలో మొక్కలు నాటాలని కోరారు. ప్రతీ మండలంలో 2 క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయడం కోసం స్థలాలను గుర్తించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌దోత్రే, డీఎఫ్‌వో నిఖిత, జడ్పీ సీఈవో సాయాగౌడ్‌, ఉద్యానవన అధికారి సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.

28న జాబ్‌మేళా

కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 28న హెచ్‌సీఎల్‌ టెక్‌బీ ఆధ్వర్యంలో ఉదయం 8 గంటలకు మెగా జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ తెలిపారు. అర్హులైన అభ్యర్థులు అర్హత సర్టిఫికేట్లతో పాటు ఆధార్‌కార్డు జిరాక్స్‌, రెండు ఫొటోలు ఆండ్రాయిడ్‌ మొబైల్‌తో హాజరుకావాలని తెలిపారు. అందుకు సంబంధించిన కరపత్రాలను గురువారం ఆవి ష్కరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ రాష్ట్ర ఇన్‌చార్జ్‌ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-20T06:46:01+05:30 IST