చిన్నారులకు వాహనాలను అప్పగించొద్దు

ABN , First Publish Date - 2022-06-29T06:29:47+05:30 IST

చిన్నారులకు వాహనాలను అప్పగించొద్దు

చిన్నారులకు వాహనాలను అప్పగించొద్దు
ద్వి చక్రవాహనం నడుపుతున్న చిన్నారులకు కౌన్సెలింగ్‌ ఇస్తున్న సీఐ శ్రీనివాస్‌

పెనమలూరు, జూన్‌ 28 : చిన్నారులకు ద్విచక్ర వాహనాలను అప్పగిం చొద్దని ట్రాఫిక్‌ సీఐ శ్రీనివాస్‌ తల్లిదండ్రులకు సూచించారు. మంగళవారం పోరంకి సెంటర్‌లో ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించారు. సుమారు 10 ఏళ్ల వయస్సు ముగ్గురు చిన్నారులు ద్విచక్రవాహనంపై వెళుతుంటే నిలువరించారు. తల్లిదం డ్రులను పిలిచి కౌన్సెలింగ్‌ నిర్వహించి పంపించారు. ఈ సందర్భంగా సీఐ శ్రీనివాస్‌ మాట్లాడుతూ, నిత్యం ఇదే తరహాలో చిన్నారులు ద్విచక్రవాహనాల ను నడుపుతుండటంతో ప్రమాదాలు వాటిల్లుతున్నాయన్నారు. వాహనదారు లు తప్పసరిగా వాహనం డాక్యుమెంట్లు కలిగి ఉండాలని, హెల్మెట్‌ లేకుండా ప్రయాణించవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్‌ ఎస్సై ప్రభాకర్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ సత్యనారాయణ, తదితర సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-06-29T06:29:47+05:30 IST