కోవిడ్ వార్డులో కుమారునికి చికిత్స... తండ్రి పరిస్థితి ఇదే!

ABN , First Publish Date - 2021-04-10T11:45:01+05:30 IST

కరోనా సెకెండ్ వేవ్ మరింత వేగంగా వ్యాప్తి చెందుతోంది.

కోవిడ్ వార్డులో కుమారునికి చికిత్స... తండ్రి పరిస్థితి ఇదే!

వడోదర: కరోనా సెకెండ్ వేవ్ మరింత వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పుడు కోరానా బారిన పడుతున్నవారిలో పిల్లల సంఖ్య కూడా అధికంగానే ఉంటోంది. గుజరాత్‌లోని వడోదరలోని ఒక ఆసుపత్రిలో పీడియాట్రిక్ కోవిడ్ వార్డులో తండ్రి పీపీఈ కిట్ ధరించి, పిల్లవాడితో పాటు కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తల్లిదండ్రులు పిల్లలల దగ్గర ఉంటేనే వారు సరిగా చికిత్స చేయించుకుంటున్నారు. ఇప్పటివరకూ చిన్నారులలో ఇమ్యూనిటీ పవర్ కారణంగా వారికి కరోనా సోకడం లేదని భావిస్తూ వచ్చారు. అయితే దీనికి భిన్నంగా ఇప్పుడు కేసులు నమోదవుతూవస్తున్నాయి. 


పిల్లలు అధిక సంఖ్యలో కరోనా బారిన పడుతున్న తరుణంలో వారి తల్లిదండ్రులు ఆసుపత్రులలో పిల్లల దగ్గరే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. గుజరాత్‌లోని వడోదర ప్రభుత్వ ఆసుపత్రికి ప్రతీరోజూ కనీసం నలుగురు కరోనా బాధిత చిన్నారులు అడ్మిట్ అవుతున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులు డాక్టర్ రాకేష్ జోషి మాట్లాడుతూ ఈ వైరస్ గతంలో మాదిరికన్నా ఇప్పుడు పిల్లలపై అధిక ప్రభావం చూపుతోందన్నారు. కరోనా బాధిత చిన్నారులలో చాలామందికి చికిత్స అందించే సమయంలో ఆక్సిజన్ అవసరమవుతున్నదన్నారు. 

Updated Date - 2021-04-10T11:45:01+05:30 IST