వడివడిగా అమృత్‌ సరోవర్‌

ABN , First Publish Date - 2022-05-26T06:28:11+05:30 IST

గ్రామాల్లో నీటి ఎద్దడిని నివారించి భూగర్భ జలాలు పెంపొందించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమృత్‌ సరోవర్‌ పథకం అమలుకు చర్యలు తీసుకుంటోంది.

వడివడిగా అమృత్‌ సరోవర్‌

- నూతనంగా కుంటలు, చెరువుల నిర్మాణం

- మరమ్మతులకు అవకాశం

- నీటి ఎద్దడి నివారణకు చర్యలు

- పెరగనున్న భూగర్బ జలాలు

జగిత్యాల, మే 25 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో నీటి ఎద్దడిని నివారించి భూగర్భ జలాలు పెంపొందించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమృత్‌ సరోవర్‌ పథకం అమలుకు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా జ గిత్యాల జిల్లాలో నూతనంగా కుంటలు, చెరువులు తవ్వడంతో పాటు చెడి పోయిన వాటికి మరమ్మతులు చేపడుతున్నారు. ఇప్పటికే జిల్లాలో అమృత్‌ సరోవర్‌ పనులు ప్రారంభమయ్యాయి.  

చిన్న నీటి వనరుల పెంపుపై దృష్టి...

జిల్లాలో అమృత్‌ సరోవర్‌ పథకంలో భాగంగా చిన్న నీటి వనరులు నిలిచి ఉండే స్థలాలు గుర్తించి కొత్తవి నిర్మాణం చేపట్టడం, అదేవిదంగా దెబ్బతిన్న పాత చెరువులు, కట్టలు, తూములు, మత్తడిల మరమ్మతులకు ప్రణాళికను రూపొందించారు. నూతన చెరువులు, కుంటల నిర్మాణాలకు జాతీయ ఉపాధి హామీ పథకం నిధులు వెచ్చించనున్నారు. ఎకరం విస్తీ ర్ణంలో 10 వేల నుంచి 15 వేల క్యూబిక్‌ మీటర్ల నీటి నిల్వ సామర్థ్యం ఉం డేలా కుంటల నిర్మాణం జరుపుతున్నారు. జిల్లాలో చాలా చోట్ల ఇప్పటి కే ఇందుకు అవసరమైన పనులు ప్రారంభించారు. త్వరగా పూర్తి చేసేం దు కు చర్యలు వేగవంతం చేస్తున్నారు. పూర్తయిన వాటిపై సర్పంచ్‌, అధికా రులు ఆగస్టు 15వ తేదీన జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని అంటున్నారు.

జిల్లాలో 75 చెరువులు, కుంటల నిర్మాణం, మరమ్మతులు..

జిల్లా వ్యాప్తంగా 75 చెరువులు, కుంటల నిర్మాణం, మరమ్మతు పనుల ను అమృత్‌ సరోవర్‌ పథకం కింద అధికారులు చేపడుతున్నారు. జిల్లాలో ని 18 మండలాల్లో 75 పనులను చేపట్టనుండగా ఇందులో 29 కొత్తగా చెరువుల, కుంటల నిర్మాణాలు చేయనున్నారు. 46 పాత చెరువులు, కుం టల మరమ్మతుల పనులు చేయడానికి నిర్ణయించారు. జిల్లా వ్యాప్తంగా 95 ఎకరాల్లో నూతనంగా చెరువులు, కుంటల నిర్మాణాలు జరుగనున్నా యి. జిల్లాలో 9.50 లక్షల క్యూబిక్‌ మీటర్ల భూగర్బ జలాలు పెరుగను న్నట్లు అధికారులు అంచనా వేశారు. జిల్లాలోని మల్యాల మండలంలో 8 పాతవి చెరువులు, కుంటల మరమ్మతులు, మెట్‌పల్లిలో 8 మరమ్మతు పనులు, కొడిమ్యాలలో 6 మరమ్మతులు, పెగడపల్లిలో 4 పాతవి, వెల్గటూ రులో 5 పాతవి, ధర్మపురిలో 4 పాతవి, గొల్లపల్లిలో 4 పాతవి, కథలా పూ ర్‌లో 2 కొత్తవి, 4 పాతవి, జగిత్యాల రూరల్‌లో 3 పాతవి, రాయికల్‌లో 6 కొత్తవి, 3 పాతవి, కోరుట్లలో 2 పాతవి, మల్లాపూర్‌లో 4 కొత్తవి, 2 పా తవి, ఇబ్రహీంపట్నంలో 1 కొత్తది, 1 పాతది, జగిత్యాలలో 1 పాతది, సా రంగపూర్‌లో 3 కొత్తవి, 1 పాతది, బీర్‌పూర్‌లో 4 కొత్తవి, బుగ్గారంలో 3 కొత్తవి, మేడిపల్లిలో 6 కొత్తవి చిన్న నీటి వనరుల నిర్మాణాలు, మరమ్మతు పనులు చేపడుతున్నారు.

పెరగనున్న భూ గర్బజలాలు...

అమృత్‌ సరోవర్‌ పథకంలో భాగంగా జిల్లా పలు చెరువులు, కుంటల నిర్మాణాలు, మరమ్మతుకు అధికారులు ప్రతిపాదించారు. ఇందుకు అవసర మైన అనుమతులు సైతం లభించాయి. ఇందుకు ఒక్కో దానికి రూ. లక్ష నుంచి రూ. 10 లక్షల వరకు వెచ్చిస్తున్నారు. నూతన నిర్మాణాలు, మర మ్మతుల అనంతరం కుంటలు, చెరువుల్లో 9.50 లక్షల క్యూబిక్‌ మీటర్ల నీరు నిల్వ ఉండే అవకాశం ఉంది. ఈ యేడాది ఆగస్టు వరకు పనులు పూర్తి చేయాలని ఉన్నతాధికారులు నుంచి ఆదేశాలున్నాయి. ఆ దిశగా జి ల్లాలో అధికారులు, ప్రజాప్రతినిధులు పనులు చేస్తున్నారు. జిల్లాలోని మల్యాలలో లక్ష క్యూబిక్‌ మీటర్లు, మెట్‌పల్లిలో 80 వేలు, కొడిమ్యాలలో 60 వేల, పెగడపల్లిలో 60 వేలు, వెల్గటూరులో 60 వేలు, ధర్మపురిలో 40 వే లు, గొల్లపల్లిలో 40 వేలు, కథలాపూర్‌లో 70 వేలు, జగిత్యాల రూరల్‌లో 30 వేలు, రాయికల్‌లో 1.10 లక్షల క్యూబిక్‌ మీటర్ల భూగర్బ జలాలు పెరగనున్నట్లు అంచనా వేశారు. కోరుట్లలో 20 వేలు, మల్లాపూర్‌లో 60 వేలు, ఇబ్రహీంపట్నంలో 20 వేలు, జగిత్యాలలో 10 వేలు, సారంగపూర్‌లో 60 వేలు, బీర్‌పూర్‌లో 40 వేలు, బుగ్గారంలో 30 వేలు, మేడిపల్లిలో 60 వేల క్యూబిక్‌ మీటర్ల భూగర్బ జలాలు పెరుగనున్నట్లు అధికారులు అంచనా వేశారు.

నూతన తవ్వకాలతో పాటు మరమ్మతులు

- వినోద్‌, డీఆర్‌డీవో, జగిత్యాల

అమృత్‌ సరోవర్‌ పథకం ద్వారా జిల్లాలో నూతనంగా చెరువులు, కుంట లు నిర్మాణాలు చేయడంతో పాటు పాత వాటికి మరమ్మతులకు గాను ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపాం. అనుమతులు సైతం లభించా యి. అభివృద్ధి పనులు ప్రారంభించాము. ఆగస్టులోపు పూర్తయ్యే లాచర్య లు తీసుకుంటాము.

భూగర్బ జలాలు పెరుగనున్నాయి

బాలె శివాజీ, డీఆర్‌డీఏ ఏపీడీ, జగిత్యాల

చిన్న నీటి వనరుల నిర్మాణాలు, మరమ్మతులతో రానున్న రోజుల్లో భూ గర్బ జలాలు పెరగనున్నాయి. నీటి ఎద్దడి సమస్యను అమృత్‌ సరోవర్‌ పథకం వల్ల నివారించడానికి అవకాశం లభిస్తోంది. పలు పనులను ఈజీఎస్‌ పథకంలో చేపడుతున్నాము.

Updated Date - 2022-05-26T06:28:11+05:30 IST