‘పెనం మీద నుండి పొయ్యిలో పడ్డాం’ అనే పుస్తకాన్ని రచించిన వడ్డే శోభనాద్రీశ్వరావు

ABN , First Publish Date - 2020-08-13T17:24:55+05:30 IST

విజయవాడ: ‘పెనం మీద నుండి పొయ్యిలో పడ్డాం’ అనే పుస్తకాన్ని మాజీ మంత్రి, రైతు నాయకులు వడ్డే శోభనాద్రీశ్వరరావు రచించారు.

‘పెనం మీద నుండి పొయ్యిలో పడ్డాం’ అనే పుస్తకాన్ని రచించిన వడ్డే శోభనాద్రీశ్వరావు

విజయవాడ: ‘పెనం మీద నుండి పొయ్యిలో పడ్డాం’ అనే పుస్తకాన్ని మాజీ మంత్రి, రైతు నాయకులు వడ్డే శోభనాద్రీశ్వరరావు రచించారు. ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ప్రెస్ క్లబ్‌లో జరిగింది. ఈ పుస్తకావిష్కరణ సభలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం నేత మధు, సుంకర రాజేంద్రప్రసాద్, వెలగపూడి గోపాలకృష్ణ ప్రసాద్, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఆన్‌లైన్‌లో బెంగుళూరు నుంచి సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ వెంకట గోపాల గౌడ పుస్తకాన్ని ఆవిష్కరించారు.


రాజధాని కోసం తరతరాలుగా ఉన్న భూములను త్యాగాలు చేసిన రైతు బిడ్డలకు ఈ పుస్తకాన్ని వడ్డే అంకితం చేశారు. అమరావతి అంకురార్పణ, ఆనాటి అధికార, ప్రతిపక్ష నేతలు ప్రకటనల ప్రాస్తావన.. అమరావతి నుంచి రాజధాని తరలింపు, నవ్యాంధ్ర ప్రదేశ్ ప్రగతికి గొడ్డలి పెట్టు.. జగన్మోహన్ రెడ్డి పిచ్చి తుగ్లక్ పాలనలో ప్రజా వ్యతిరేక నిర్ణయాలు.. సువర్ణవకాశాన్ని చేజేతులా జారవిడుచుకున్న నారా చంద్రబాబు.. తదితర అంశాలను పుస్తకంలో ముఖ్యంగా ప్రస్తావించారు. 


Updated Date - 2020-08-13T17:24:55+05:30 IST