విశాఖలో మంత్రుల భూమి ఎందుకు పంచడంలేదు?: వడ్డే

ABN , First Publish Date - 2020-02-21T23:20:05+05:30 IST

విజయవాడ: బలహీనవర్గాల వారి భూములను బలవంతంగా ప్రభుత్వం సేకరిస్తోందని..

విశాఖలో మంత్రుల భూమి ఎందుకు పంచడంలేదు?: వడ్డే

విజయవాడ: బలహీనవర్గాల వారి భూములను బలవంతంగా ప్రభుత్వం సేకరిస్తోందని, భూసేకరణకు విధివిధానాలను పాటించడంలేదని వడ్డే శోభనాద్రీశ్వరరావు విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పేదలు అంగీకరిస్తే... నష్టపరిహారం ఇచ్చి భూమి సేకరించాలన్నారు. పరిహారం ఇవ్వకుండా మభ్యపెట్టి భూములు తీసుకుంటున్నారని మండిపడ్డారు. నేతి బీరకాయలో నెయ్యిలాగే... పేదలపై జగన్‌ ప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు. విశాఖలో వైసీపీ మంత్రుల భూమి ఎందుకు పంచడంలేదని ఆయన ప్రశ్నించారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని ఆరోపించిన ప్రభుత్వం.. ఏమీ నిరూపించలేకపోయిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో భూదోపిడీని హెచ్‌ఆర్సీ పరిశీలించి న్యాయం చేయాలని వడ్డే శోభనాద్రీశ్వరరావు కోరారు.

Updated Date - 2020-02-21T23:20:05+05:30 IST