వాడవాడలా గణతంత్ర వేడుక

ABN , First Publish Date - 2022-01-27T06:21:19+05:30 IST

వాడవాడలా గణతంత్ర వేడుక

వాడవాడలా గణతంత్ర వేడుక
మునిసిపల్‌ కార్యాలయంలో జెండాకు వందనం చేస్తున్న కమిషనర్‌ కనకారావు, చైర్‌పర్సన్‌ ఆదిలక్ష్మి తదితరులు

నర్సీపట్నం/అర్బన్‌,జనవరి 26 : గణతంత్ర దినోత్సవాన్ని నియోజక వర్గంలోని నాలుగు మండలాల్లో బుధ వారం అత్యంత ఘనంగా నిర్వహిం చారు. ఇందులో భాగంగా సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో ఆర్డీవో గోవిందరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు.  మునిసిపల్‌ కార్యాలయంలో కమిషనర్‌ ఎన్‌.కనకారావు, చైర్‌పర్సన్‌ ఆదిలక్ష్మి, డివిజినల్‌ అటవీశాఖ కార్యాలయంలో డీఎఫ్‌వో సీహెచ్‌.సూర్యనారాయణ, నర్సీ పట్టణ పోలీస్‌ స్టేషన్‌ ఆవరణ రూరల్‌ సీఐ శ్రీనివాసరావు, ఎంపీడీవో కార్యాల యంలో ఎంపీడీవో ఎన్‌.జయమాధవి, తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ కె.జయ జెండాను ఎగుర వేశారు. ఎంపీపీ సుర్ల రాజేశ్వరి, వైస్‌ ఎంపీపీ ఇన్నం రత్నం తదితరులు పాల్గొన్నారు.  మిగిలిన ప్రభుత్వ కార్యాలయాల్లో   అధికారులు, పాఠశాలల్లో హెచ్‌ఎంలు ఈ వేడుకలను నిర్వహించారు. 

 గొలుగొండ : ఇక్కడి ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో డేవిడ్‌రాజ్‌, తహసీల్దార్‌ కార్యాలయంలో  తహసీల్దార్‌ వెంకటేశ్వరరావు, పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌ఐ ధనుంజయనాయుడు, అలాగే పలు ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశా లల్లో జాతీయ జెండాను ఆవిష్కరిం చారు. ఎంపీపీ గజ్జలపు మణికుమారి, అధికారులు పాల్గొన్నారు. ఇది లావుంటే, ఈ వేడుకల్లో భాగంగా జోగంపేట ప్రాథమికోన్నత పాఠశాలలో జాతీయ జెండా ఏర్పాటులో నిర్లక్ష్యంపై హెచ్‌ఎం    స్పర్జన్‌రాజ్‌ను ప్రశ్నించినందుకు ఆయన తమను అవమానించారని సర్పంచ్‌ జువ్వల లక్ష్మి ఆరోపించారు. దీనిపై హెచ్‌ఎంను వివరణ కోరగా,  పాఠశాల లోని ఎండీఎం నిర్వాహకురాలిని తొలగించాలని సర్పంచ్‌ ఒత్తిడి తెస్తున్నారన్నారు. ఇందుకు నిరాకరించ డంతో ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు.

కృష్ణాదేవిపేట: కొయ్యూరు సర్కిల్‌ కార్యాలయంలో సీఐ అల్లు స్వామినాయుడు, అటవీ రేంజ్‌ కార్యాలయంలో రేంజ్‌ ఆఫీసర్‌ సుంకర వెంకటరావు, కృష్ణాదేవిపేట స్టేషన్‌లో ఎస్‌ఐ సూర్యనారాయణ జెండాలను ఎగురవేశారు. 

నాతవరం : మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీడీవో యాదగిరేశ్వరరావు, తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ జానకమ్మ, పోలీస్‌ స్టేష న్‌లో ఎస్‌ఐ డి.శేఖరం జాతీయ జెం డాను ఎగురవేశారు. ఇక్కడి అంబేడ్కర్‌ విగ్రహానికి మాజీ ఎంపీపీ ఎన్‌.విజయ్‌కుమార్‌ తదితరులు పూలమాలలు వేసి వేడుకలు నిర్వహించారు. ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి, జడ్పీటీసీ అప్పలనర్స, కరక అప్పలరాజు పాల్గొన్నారు. 

 మాకవరపాలెం : మండల పరిషత్‌ కార్యాలయం వద్ద ఎంపీపీ రుత్తల సత్యనారాయణ, తహసీల్దార్‌ కార్యాల యంలో తహసీల్దార్‌ రాణిఅమ్మాజీ,   స్టేషన్‌లో ఎస్‌ఐ రామకృష్ణ  జెండాలను ఎగురవేశారు. అలాగే పలు ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో ఈ వేడు కలను ఘనంగా నిర్వహించారు. 

Updated Date - 2022-01-27T06:21:19+05:30 IST