వాడపల్లి హుండీల ఆదాయం రూ.48,37,141

ABN , First Publish Date - 2022-09-23T06:50:04+05:30 IST

కోనసీమ తిరుమల వాడపల్లి ఆలయంలో హుండీల ను మందేశ్వరస్వామి దేవస్థానం అసిస్టెంట్‌ కమిషనర్‌ శింగం రాధ, ఈవోలు ప్రసాదరాజు, సీహెచ్‌ సత్యనారాయణ పర్యవేక్షణలో గురువారం తెరిచి లెక్కించారు. 27 రోజులకు ప్రధాన హుండీల ద్వారా రూ.42,02,860, అన్నప్రసాదం హుండీల ద్వారా రూ. 6,34,281... మొత్తం రూ.48,37,141 ఆదాయం లభించింది. బంగారం 21 గ్రాములు, వెండి 568 గ్రాములు, పలు దేశాల విదేశీ కరెన్సీ లభించినట్టు ఆలయ చైర్మన్‌ రుద్రరాజు రమేష్‌రాజు, ఈవో ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు.

వాడపల్లి హుండీల ఆదాయం రూ.48,37,141

  • బంగారం 21 గ్రాములు, వెండి 568 గ్రాముల కానుకలు

ఆత్రేయపురం, సెప్టెంబరు 22: కోనసీమ తిరుమల వాడపల్లి ఆలయంలో హుండీల ను మందేశ్వరస్వామి దేవస్థానం అసిస్టెంట్‌ కమిషనర్‌ శింగం రాధ, ఈవోలు ప్రసాదరాజు, సీహెచ్‌ సత్యనారాయణ పర్యవేక్షణలో గురువారం తెరిచి లెక్కించారు. 27 రోజులకు ప్రధాన హుండీల ద్వారా రూ.42,02,860, అన్నప్రసాదం హుండీల ద్వారా రూ. 6,34,281... మొత్తం రూ.48,37,141 ఆదాయం లభించింది. బంగారం 21 గ్రాములు, వెండి 568 గ్రాములు, పలు దేశాల విదేశీ కరెన్సీ లభించినట్టు ఆలయ చైర్మన్‌ రుద్రరాజు రమేష్‌రాజు, ఈవో ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. క్షేత్ర పాలకుడు విశ్వేశ్వరస్వామి హుండీ ఆదాయం 27రోజులకు రూ.1,05,848 లభించింది. లెక్కింపులో బ్యాంకు సిబ్బంది, పోలీసులు, ధర్మకర్తల మండలి సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-23T06:50:04+05:30 IST