వ్యాక్సినేషనకు ఏడాది

ABN , First Publish Date - 2022-01-17T04:28:07+05:30 IST

జిల్లా తొలి కరోనా టీకా వేసి ఈ నెల 16వ తేదీ నాటికి ఏడాది పూర్తయింది. గత ఏడాది జనవరి 16వ తేదీన కరోనా వ్యాక్సినేషన ప్రారంభిం చారు.

వ్యాక్సినేషనకు ఏడాది
కరోనా వ్యాక్సిన వేస్తున్న వైద్య సిబ్బంది(ఫైల్‌)

మొదటి డోసులో రాష్ట్రంలోనే జిల్లా ప్రథమస్థానం

అదే దిశగా రెండవ డోసు

పిల్లల టీకాల్లోనూ అదే ప్రగతి

బూస్టర్‌ డోసు దిశగా వైద్యశాఖ


నెల్లూరు(వైద్యం) జనవరి 16 :  జిల్లా తొలి కరోనా టీకా వేసి ఈ నెల 16వ తేదీ నాటికి ఏడాది పూర్తయింది. గత ఏడాది జనవరి 16వ తేదీన కరోనా వ్యాక్సినేషన ప్రారంభిం చారు. ఈ నేపధ్యంలో వ్యాక్సినేషన జిల్లాలో జోరుగా సాగుతోంది. పెద్ద సంఖ్యలో వ్యాక్సినేషన కేంద్రాలు ఏర్పాటు చేసి వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది వ్యాక్సిన వేస్తున్నారు. జిల్లా ప్రజలు కూడా వ్యాక్సినేషన సెంటర్‌లకు తరలివచ్చి వ్యాక్సి న వేసుకుంటున్నారు. మొదట్లో జిల్లా ప్రజలు వ్యాక్సినేష నపై విముఖత చూపినా కరోనా భయంతో వ్యాక్సినేషనకు పెద్దసంఖ్యలో వ్యాక్సినేషన సెంటర్‌లకు తరలివస్తున్నారు. కాగా కరోనా వ్యాక్సినేషనలో రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్ధానంలో నిలిచింది. అలాగే రెండవ డోసులో కూడా జిల్లా 85 శాతం ప్రగతి సాధించి రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలు స్తోంది. ఇక పిల్లలకు వ్యాక్సినేషనలో కూడా వైద్యశాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. బూస్టర్‌ డోసు వ్యాక్సినేషనకు కూడా ప్రాధాన్యమిస్తున్నారు. మొత్తం మీద కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆయా వ్యాక్సినేషన కేం ద్రాలకు జిల్లా ప్రజలు తరలివస్తున్నారు. జిల్లాలోని 75  పీహెచసీలు, 14 సీహెచసీలు, 14 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, కావలి, గూడూరు ఏరియా ఆసుత్రులు, ఆత్మకూరు జిల్లా ఆసుపత్రి, నెల్లూరు జీజీహెచ ఆసుపత్రులలో  కరోనా వ్యాక్సిన వేస్తున్నారు. ఇకపోతే కరోనా థర్డ్‌వేవ్‌ హెచ్చరికల నేపధ్యంలో ప్రత్యేకంగా కేంద్రప్రభుత్వం కూడా వ్యాక్సినేషన ను జిల్లాకు పెద్ద ఎత్తున కేటాయిస్తున్నది. 


వ్యాక్సినేషన వేసిందిలా.. 


జిల్లాలో వ్యాక్సినేషనను పరిశీలిస్తే గత జనవరి 16న మొదటి విడత కరోనా వ్యాక్సిన ప్రారంభమయింది. ఇందు లో ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్యులు, సిబ్బంది. ఐసీడీఎస్‌ సిబ్బం దికి వ్యాక్సిన వేయాలని ప్రణాళికను రూపొందించారు. ఆ దిశగా వ్యాక్సిన వేశారు. ఇక రెండో విడత కరోనా టీకా కా ర్యక్రమం ఫిబ్రవరిలో మొదలు కాగా పంచాయతీరాజ్‌, రెవెన్యూ, మున్సిపల్‌, పోలీసుశాఖ ఉద్యోగులకు వేశారు. మార్చి 1వ తేదీ నుంచి మూడో విడత కరోనా వ్యాక్సిన కొన సాగింది. వీరంతా 60 ఏళ్లు పైబడిన వారు, 45 ఏళ్ల పైబడి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు ఉన్నారు. ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి నాలుగో విడత 45 ఏళ్ల వారికి టీకా వేయాలని ప్రభుత్వం నిర్ణయించటంతో ఆదిశగా కరోనా వ్యాక్సిన వేశారు. అలాగే 18 ఏళ్ల పైబడిన వారికి కూడా 5వ విడతలో కరోనా వ్యాక్సిన వేశారు. ఈ నెల 3వ తేదీ నుంచి 15 నుంచి 18 ఏళ్ల లోపు పిల్లలకు కరోనా వాక్సిన వేశారు. దీంతో పాటు రెండు డోసులు వ్యాక్సిన వేసుకున్న వారికి బూస్టర్‌ బోసు ను కూడా ఈ నెల 10వ తేదీన ప్రారంభించారు. 


మహిళలే ఎక్కువ


జిల్లావ్యాప్తంగా జరుగుతున్న కరోనా వ్యాక్సినేషనలో ఎక్కువగా మహిళలే ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా ఆదివారం వరకు 47,91,802 డోసులు కరోనా వ్యాక్సిన వేశారు. ఇందు లో మహిళలు 24,59,709 మంది ఉండగా, పురుషులు 22,94,291 మంది ఉన్నారు. వ్యాక్సినేషన కేంద్రాలకు ఎక్కు వగా మహిళలే రావటం విశేషం. మొదట్లో కరోనా వ్యాక్సిన పట్ల ప్రజల్లో పెద్దగా ఆసక్తి లేకపోవటంతో అప్పట్లో వ్యాక్సిన వేయించుకునే వారు చాలా తక్కువ మందే ఉండేవారు. ప్రస్తుతం పరిస్ధితులు మారాయి. కరోనా విజృంభిస్తున్న ఈ తరుణంలో ప్రజల్లో వ్యాక్సిన పట్ల ఆసక్తి పెరిగింది. కరోనా వ్యాక్సిన కోసం వ్యాక్సిన కేంద్రాలకు వచ్చేవారే ఎక్కువమంది ఉన్నారు. జిల్లాలో మొదటి డోసు కింద 25,75,460మంది వ్యాక్సిన వేసుకున్నారు. అలాగే సెకండ్‌ డోసు కింద 21,79,430మంది వ్యాక్సిన వేయించుకు న్నారు. వారం రోజులుగా కరోనా పాజిటివ్‌ కేసులు పెరగ టంతో వ్యాక్సిన కేంద్రాల వైపు జనం పరుగులు తీస్తున్నా రు.  


 వ్యాక్సినేషనలో ప్రగతి


జిల్లాలో వాక్సినేషన వేగవంతంగా జరుగుతుంది. కరోనా వ్యాక్సిన కేంద్రాలకు వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. మొదటి డోసు వ్యాక్సినేషనలో జిల్లా మొదటి స్ధానంలో నిలి చింది. అలాగే రెండవ డోసులో కూడా జిల్లాలో అగ్రస్ధానం లో నిలిపేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాం. పిల్లలకు వ్యాక్సినేషన వేయటంలో ప్రత్యేక దృష్టి పెట్టాం. అలాగే బూ స్టర్‌ డోసు కూడా వేస్తున్నాం. కరోనా కేసులు పెరుగుతుండ డంతో అందరూ వ్యాక్సిన వేయించుకోవాలి.

- కలెక్టర్‌ వీవీఎస్‌. చక్రదర్‌బాబు 

Updated Date - 2022-01-17T04:28:07+05:30 IST