పోలీసు కుటుంబ సభ్యులకు టీకాలు : ఎస్పీ

ABN , First Publish Date - 2021-06-19T05:49:57+05:30 IST

కరోనా మహమ్మారిని అంతమొందించేందుకు ప్రతి ఒక్కరూ టీకా వేసుకోవాలన్న ఆలోచనతో పోలీసు హెడ్‌క్వార్టర్‌లో నిర్వ హించిన వ్యాక్సినేషన్‌ మేళాలో పోలీసు కుటుంబ సభ్యులకు టీకాలు వేయడం జరుగుతుందని ఎస్పీ ఎం.రాజేశ్‌చంద్ర అన్నారు.

పోలీసు కుటుంబ సభ్యులకు టీకాలు : ఎస్పీ
వ్యాక్సినేషన్‌ను పరిశీలిస్తున్న ఎస్పీ

ఆదిలాబాద్‌టౌన్‌, జూన్‌ 18: కరోనా మహమ్మారిని అంతమొందించేందుకు ప్రతి ఒక్కరూ టీకా వేసుకోవాలన్న ఆలోచనతో పోలీసు హెడ్‌క్వార్టర్‌లో నిర్వ హించిన వ్యాక్సినేషన్‌ మేళాలో పోలీసు కుటుంబ సభ్యులకు టీకాలు వేయడం జరుగుతుందని ఎస్పీ ఎం.రాజేశ్‌చంద్ర అన్నారు. శుక్రవారం హెడ్‌క్వార్టర్‌లో ఏర్పాటు చేసిన మేళాను ఎస్పీ ప్రారంభించారు. ఇందులో ముందుగా ఉట్నూర్‌ డీఎస్పీ ఎన్‌.ఉదయ్‌రెడ్డి వ్యాక్సిన్‌ తీసుకున్నారు. కాగా, పోలీసు హెడ్‌క్వార్టర్‌లో రెండు రోజుల్లో 2వేల మందికి టీకాలు వేసేందుకు అవసరమైన ఏర్పాట్లను సిద్ధం చేయగా ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సురక్షిత మైన జీవనం కొనసాగించేందుకు ప్రతి ఒక్కరు తమవంతు బాధ్యతగా కోవిడ్‌ టీకాలు తీసుకోవాలని ఎస్పీ పేర్కొన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి నరేందర్‌రాథోడ్‌ సౌజన్యంతో రిమ్స్‌ వైద్యులు, సిబ్బంది వ్యాక్సిన్‌ ఇవ్వడానికి తగిన ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లాలో నివసిస్తున్న పోలీసు కుటుంబ సభ్యులందరికీ మొదటి డోసు టీకాల కోసం మోటార్‌ వాహనాల ఇన్‌స్పెక్టర్‌ ఓ.సుధాకర్‌ రావు ఆధ్వర్యంలో అన్ని పోలీసు స్టేషన్ల నుంచి బస్సుల్లో తరలించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ఇప్పటికే ఫ్రంట్‌ వారియర్‌గా విధులు నిర్వహిస్తున్న జిల్లా పోలీసులందరికి మొదటి, రెండవ డోసు ప్రక్రియ 95శాతం పూర్తయిందని తెలి పారు. ఈ వ్యాక్సినేషన్‌ టీకాల ప్రక్రియ నేటి సాయంత్రం వరకు కొనసాగుతుం దని, నిర్మల్‌, కొమురరంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో పనిచేస్తూ ఈ జిల్లాలో నివసి స్తున్న కుటుంబ సభ్యులు సైతం టీకాలు వేసుకోవాలని సూచించారు. అందుకు రవాణా సౌకర్యం సిద్ధంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓఎస్డీ హర్షవర్ధన్‌ శ్రీవాత్సవ్‌, అదనపు ఎస్పీలు శ్రీనివాస్‌రావు, సమైజాన్‌రావ్‌, బి.వినోద్‌ కుమార్‌, డీఎంఅండ్‌హెచ్‌వో నరేందర్‌ రాథోడ్‌, సీఐలు, ఎస్సైలు తదితరులన్నారు.

Updated Date - 2021-06-19T05:49:57+05:30 IST