నేటి నుండి రెండో విడత ప్రారంభం
జిల్లా వైద్య అధికారి ధనరాజ్
నిర్మల్ కల్చరల్, ఏప్రిల్ 3 : మిషన్ ఇంద్రధనుస్సు ద్వారా టీకాలు తీసుకోని పి ల్లలకు సోమవారం నుండి టీకాలు అందించే కార్యక్రమం చేపట్టినట్లు జిల్లా వైద్య అధికారి డాక్టర్ ధనరాజ్ తెలిపారు. ఆదివారం ఆయన విడుదల చేసిన ప్రకట నలో గత నెల 7 నుంచి వారం రోజులు మిషన్ ఇంద్రధనుస్సు కార్యక్రమం నిర్వహించి టీకాలు అందజేస్తామని అన్నారు. కొవిడ్ మహమ్మారి వల్లగానీ, మరే ఇతర కారణాల వల్ల సరైన సమయంలో టీకాలు తీసుకోని పిల్లలకు నేటి నుండి టీకాలు వేయనున్నట్లు వివరించారు. ఈనెల 4 నుంచి వారంరోజుల పాటు మిషన్ ఇంద్రధనుస్సు నిర్వహిస్తున్నామన్నారు. పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి పెంపొందించడానికి టీకాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. 12 రకాల వ్యాధులు సోకకుండా టీకాపని చేస్తుందన్నారు. కోరింతదగ్గు, డిప్తీరియా, ధను ర్వాతం,పోలియో,క్షయ,తట్టు తదితర వ్యాధులు రాకుండా పిల్లలను కాపాడుతా యని అన్నారు. మొదటి విడతలో 1919 మంది పిల్లలకు టీకాలు వేశామని తెలిపారు. రెండోవిడతలో 664 మందిని గుర్తించామన్నారు. టీకా తీసుకొనేవారు ఈ అవకాశం ఉపయోగించుకోవాలన్నారు.