జిల్లాలో 263మందికి టీకాలు

ABN , First Publish Date - 2021-03-04T06:35:18+05:30 IST

జిల్లాలో వృద్ధులకు కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ టీకాకార్యక్రమాన్ని మూడో రోజు బుధవారం కొనసాగించారు.

జిల్లాలో 263మందికి టీకాలు
వైస్‌ చైర్మన్‌కు టీకా వేస్తున్న చైర్‌పర్సన్‌ డాక్టర్‌ శ్రావణి

జగిత్యాల టౌన్‌, మార్చి 3: జిల్లాలో వృద్ధులకు కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ టీకాకార్యక్రమాన్ని మూడో రోజు బుధవారం కొనసాగించారు. జిల్లాలో జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రితోపాటు  ఏటీఎం, గీతా ఆర్థోపెడిక్‌ ప్రైవేటు ఆస్పత్రుల్లో, మెట్‌ పల్లిలోని సాయిసంజీవని, కోరుట్లలోని శివసాయి ఆస్పత్రికి టీకాలు వేసేందుకు అనుమతి ఇచ్చారు. ఈ నాలుగు ఆస్పత్రుల్లో 325మంది తమ పేర్లను నమోదు చేసుకోగా 263మంది టీకాలు వేసుకున్నట్లు వైధ్యాధికారి శ్రీధర్‌ వివరించారు. 


వ్యాక్సిన్‌పై అపోహలు వద్దు..

బల్దియా చైర్‌పర్సన్‌ భోగ శ్రావణి

కొవిడ్‌ వ్యాక్సిన్‌పై అపోహలు పెట్టుకోవద్దని బల్దియా చైర్‌పర్సన్‌ భోగ శ్రావణి అన్నారు. బుధవారం జగిత్యాల పట్టణంలోని ఏటీఎం ఆసుపత్రిలో టీకా వేసే కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. కార్యక్రమంలో వైద్యుడు చంధ్రశేఖర్‌గౌడ్‌, కౌన్సిలర్లు కూసరి ఆనీల్‌, అల్లె గంగాసాగర్‌ పాల్గొన్నారు.గీతా ఆస్పత్రిలో టీకా కార్యక్రమాన్ని అదనపుకలెక్టర్‌ రాజేశం పరిశీలించారు.

జిల్లాలో 7పాజిటివ్‌ కేసులు

జగిత్యాల టౌన్‌, మార్చి 3: జిల్లాలోని 25ఆరోగ్య కేంద్రాల్లో బుధవారం 806 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఏడుగురికి పాజిటివ్‌ వచ్చినట్లు వైధ్యాధికారి శ్రీధర్‌ తెలిపారు.

Updated Date - 2021-03-04T06:35:18+05:30 IST