అరకోటి రిజిస్ట్రేషన్‌లు

ABN , First Publish Date - 2021-03-03T07:14:05+05:30 IST

కొవిన్‌ పోర్టల్‌లో సాంకేతిక సమస్యలు దూరమవడంతో రెండో రోజున టీకా నమోదు ప్రక్రియ వేగాన్ని పుంజుకుంది. ఒకే రోజు భారీగా 40 లక్షల రిజిస్ట్రేషన్లు జరగడంతో మంగళవారం దేశవ్యాప్తంగా జరిగిన మొత్తం రిజిస్ట్రేషన్ల సంఖ్య

అరకోటి  రిజిస్ట్రేషన్‌లు

మంగళవారం సాయంత్రం నాటికి

ఐదు లక్షల మందికి టీకాలు

కొవిన్‌ పోర్టల్‌లో సమస్యల్లేవు: కేంద్రం

రెండు రోజుల్లో.. అరకోటి వ్యాక్సిన్‌ రిజిస్ట్రేషన్లు


న్యూఢిల్లీ, మార్చి 2: కొవిన్‌ పోర్టల్‌లో సాంకేతిక సమస్యలు దూరమవడంతో రెండో రోజున టీకా నమోదు ప్రక్రియ వేగాన్ని పుంజుకుంది. ఒకే రోజు భారీగా 40 లక్షల రిజిస్ట్రేషన్లు జరగడంతో మంగళవారం దేశవ్యాప్తంగా జరిగిన మొత్తం రిజిస్ట్రేషన్ల సంఖ్య అరకోటి దాటింది. ఇప్పటిదాకా రెండో విడతలో ఐదు లక్షల మందికి టీకాలు ఇచ్చారు. జనవరి 16 నుంచి ఇప్పటివరకు దేశంలో 1.54 కోట్ల మందికి వ్యాక్సినేషన్‌ చేశారు. ఆస్పత్రిలో తగినన్ని డోసులు, వ్యాక్సినేషన్‌ చేసేందుకు సరిపడా సిబ్బంది ఉంటే సాయంత్రం 5 గంటల తర్వాత కూడా టీకాలు వేయొచ్చని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ స్పష్టం చేశారు.

Updated Date - 2021-03-03T07:14:05+05:30 IST