Abn logo
Apr 12 2021 @ 23:46PM

టీకా ఉత్సవ్‌ లక్ష్యాలు నూరు శాతం చేరుకోవాలి

  •  సబ్‌కలెక్టర్‌ అనుప అంజలి

రాజమహేంద్రవరం సిటీ, ఏప్రిల్‌ 12: కరోనా నియంత్రణ ప్రభుత్వ నిర్వహిస్తున్న టీకా ఉత్సవ్‌ కార్యక్రమ లక్ష్యాలు నూటికి నూరు శాతం చేరు కోవాలని వివిధ శాఖల అధికారు లను సబ్‌ కలెక్టర్‌ అనుపమ అంజలి ఆదేశించారు. సోమవా రం సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో ఆమె కార్పొరేషన్‌ అధికారు లు, తహశీల్దార్లు, ఎంపీడీవోలు, పంచాయతీ అధికారులతో సమావేశం నిర్వహించారు. అధికారులందరూ ప్రణాళిక ప్ర కారం టీకా ఉత్సవ్‌ను పూర్తి చేయాలన్నారు. వలంటీర్ల సేవా పురస్కారాల ప్రదాన కార్యక్రమం ఈనెల 15న స్థానిక ఆనం కళాకేంద్రంలో జరుగుతుందని దీనిలో రాజమహేంద్రవరం, రూరల్‌, రాజానగరం పరిధిలో వలంటీర్లకు అందిస్తారని చెప్పారు. కార్యక్రమం నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని ఆదే శించారు. కార్పొరేషన్‌ అదనపు కమిషనర్‌ ఎన్‌వీవీ సత్యనా రాయణ, డీఎల్పీవో జె.సత్యనారాయణ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement