అక్టోబరు నాటికి అందరికీ టీకా

ABN , First Publish Date - 2021-06-18T05:15:13+05:30 IST

అక్టోబరు నాటికి జిల్లా ప్రజలందరికీ కొవిడ్‌ టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కలెక్టర్‌ హరి జవహర్‌లాల్‌ చెప్పారు. సఫాయి కర్మచారి, పారిశుధ్య కార్మికుల సమస్యల పరిష్కారానికి గురువారం సంబంధిత అధికారులతో జూమ్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పారిశుధ్య కార్మికులందరికీ తప్పనిసరిగా టీకా రెండు డోసులు వేయాలన్నారు.

అక్టోబరు నాటికి అందరికీ టీకా

కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ 

కలెక్టరేట్‌, జూన్‌ 17: అక్టోబరు నాటికి జిల్లా ప్రజలందరికీ కొవిడ్‌ టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కలెక్టర్‌ హరి జవహర్‌లాల్‌ చెప్పారు. సఫాయి కర్మచారి, పారిశుధ్య కార్మికుల సమస్యల పరిష్కారానికి  గురువారం సంబంధిత అధికారులతో జూమ్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పారిశుధ్య కార్మికులందరికీ తప్పనిసరిగా టీకా రెండు డోసులు వేయాలన్నారు. వారు నిత్యం క్షేత్రస్థాయిలో పనిచేయాల్సి ఉంటుందని... రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు. మాస్కులు, శానిటైజర్లు, గ్లౌజులు, పీపీఈ కిట్లు అందజేయాలన్నారు. వారి రక్షణ బాధ్యత మున్సిపల్‌, మండల పరిషత్‌ అధికారులదేనని స్పష్టం చేశారు. జిల్లాలో రోజుకు 45 వేల మందికి టీకాలు వేసే సామర్థ్యం మనకు ఉందని, ఇప్పటి వరకూ సుమారు 6 లక్షల మందికి వ్యాక్సిన్‌ వేశామని చెప్పారు. కరోనా మొదటి, రెండో దశలను సమర్థంగా ఎదుర్కొన్నామని గుర్తు చేశారు. మూడో దశ వస్తే ఎదుర్కొనేందుకు సన్నాహాలు ప్రారంభించామని చెప్పారు. జూమ్‌ కాన్ఫరెన్స్‌లో జేసీ వెంకటరావు, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ సునీల్‌ రాజకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-06-18T05:15:13+05:30 IST