వ్యాక్సినేషన్‌ కేంద్రం పరిశీలన

ABN , First Publish Date - 2021-05-14T04:16:42+05:30 IST

స్థానిక దళితవాడ పాఠశాలలో నిర్వహిస్తున్న కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని గురువారం గండిపాళెం పీహెచ్‌సీ ఆరోగ్య బోధకులు వెంకటసుబ్బయ్య పరిశీలించారు.

వ్యాక్సినేషన్‌ కేంద్రం పరిశీలన

ఉదయగిరి రూరల్‌, మే 13: స్థానిక దళితవాడ పాఠశాలలో నిర్వహిస్తున్న కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని గురువారం గండిపాళెం పీహెచ్‌సీ ఆరోగ్య బోధకులు వెంకటసుబ్బయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాక్సిన్‌ వేయించుకున్న వారు అరగంటపాటు వైద్యసిబ్బంది పర్యవేక్షణలో ఉంచుకుని పంపాలన్నారు. మొదటి డోసు పూర్తి చేసుకొన్న వారంతా రెండో డోసు తప్పనిసరిగా వేయించుకోవాలన్నారు. 

Updated Date - 2021-05-14T04:16:42+05:30 IST