Abn logo
Sep 26 2021 @ 00:53AM

వ్యాక్సినేషన్‌ను వంద శాతం పూర్తి చేయాలి

వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

- సీజనల్‌ వ్యాధుల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలి

- మండల స్థాయి అధికారులకు కలెక్టర్‌ ఆదేశం

సిరిసిల్ల కలెక్టరేట్‌, సెప్టెంబరు 25: జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్‌ పక్రియను వందశాతం పూర్తయ్యేలా చర్యలు చేపట్టడంతో పాటు సీజనల్‌ వ్యాధుల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలని జిల్లా కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అదేశించారు. సిరిసిల్ల జిల్లా సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయం నుంచి శనివారం సాయంత్రం అన్నీ మండలాల వైద్యాధికారులు, ఎంపీడీవోలు, ఎంపీవోలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అక్కడి పరిస్థితులను సమీక్షించారు. వ్యాక్సినేషన్‌ పక్రియను క్షేత్రస్థాయిలో అందరికి అవగాహన కల్పిస్తూ తక్కువ సమయంలో ఎక్కువ మంది వ్యాక్సిన్‌ తీసుకునేలా ప్రొత్సహించిన అరోగ్య కార్యకర్తలు, అధికారులు, ప్రజాప్రతినిధులను అభినందించారు. వ్యాక్సినేషన్‌ పక్రియ జిల్లాలో 97 శాతం పూర్తయ్యిందని మిగిలింది. త్వరితగతిన పూర్తి చేసేలా తగిన చర్యలు చేపట్టాలని అదేశించారు. ముఖ్యంగా ఇల్లంతకుంట మండల పరిధిలో వ్యాక్సినేషన్‌ పురోగతిని వేగవంతం చేయాలని అదేశించారు. మండలాల పరిధిలో వందశాతం లక్ష్యానికి గాను మిగిలి ఉన్నా వ్యాక్సినేషన్‌ పక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. సిరిసిల్ల, వేములవాడ పరిఽధిలో ఉన్న వలస కూలీలకు వ్యాక్సినేషన్‌ అందించాలని అన్నారు. సీజనల్‌ వ్యాధుల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండడంతో పాటు ప్రజలను అప్రమత్తం చేసి గ్రామాల్లో జ్వరం, డెంగ్యూ కేసులు రాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.  వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ సుమన్‌మోహన్‌రావు, జిల్లా పంచాయతీ అధికారి రవీందర్‌, జిల్లా పంచాయతీరాజ్‌ ఈఈ శ్రీనివాసరావు, జిల్లా వైద్య శాఖ పోగ్రాం అధికారి శ్రీరాములు, జిల్లా అసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మురళీధర్‌రావు, వేములవాడ సూపరింటెండెంట్‌ మురళీధర్‌రావు పాల్గొన్నారు.